కేదార్ నాథ్ యాత్రతో ‘‘కనకధారే’’…. నెల తిరిగి లోపే 200 కోట్లు

హిందువులకు అత్యంత పవిత్రమైన యాత్ర కేదార్ నాథ్ యాత్ర. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. హిందువులు కచ్చితంగా ఈ చార్ ధామ్ యాత్రను పూర్తి చేస్తారు. అయితే.. ఈ యాత్ర కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా.. కొన్ని వందల మందికి ఉపాధి క్షేత్రం కూడా. చిన్నా చితక, పెద్ద వ్యాపారులు ఆర్థికంగా పరిపుష్టం కూడా అవుతారు.అయితే..ఈ యేడాది కేదార్ నాథ్ యాత్ర ఉత్తరాఖండ్ లో ఆర్థిక చోదకంగా అవతరించింది. ఈ యాత్ర మే మాసంలో ప్రారంభమైంది. ఒక్క నెలలోనే కేవలం 200 కోట్లను ఆర్జింజి పెట్టింది. దీంతో ఆర్థిక పరిపుష్టి కూడా చేకూరింది.

అయితే.. ఇంతలా ఆర్థిక పరిపుష్టి అవడానికి కారణం అక్కడ వున్న విస్తృతమైన సేవలే కారణమని అధికారులు చెబుతున్నారు. భక్తులను తీసుకెళ్లే గుర్రాలు, కంచర గాడిదలు, డోలీల ద్వారానే 40.5 కోట్లు వస్తున్నాయి.గౌరీకుండ్ మరియు కేదార్‌నాథ్ మందిరం మధ్య మార్గంలో 1.39 లక్షలకు పైగా భక్తులు ఈ సేవలను ఉపయోగించుకున్నారు.అలాగే హెలికాప్టర్ సేవలకు కూడా అధికంగా డిమాండ్ వుంది. మొత్తం 9 హెలిప్యాడ్లు వున్నాయి. మొత్తం 8 కంపెనీలకు సంబంధించినవి ఇవి. ఈ రైడ్ల ద్వారా 33 వేల మంది యాత్రికులు రవాణా అవుతారని ఓ లెక్క. వీటి ద్వారా 35 కోట్లు వస్తున్నాయి.


ఇక మరో సేవ కూడా అక్కడ అందుబాటులో వుంది. వృద్ధులు, వికలాంగులకు ముఖ్యంగా వినియోగించే డోలీ (పల్లకీ) సేవల ద్వారా 1.16 కోట్ల ఆదాయం వచ్చింది.సోన్‌ప్రయాగ్ మరియు గౌరికుండ్ మధ్య నడుస్తున్న స్థానిక షటిల్ టాక్సీ సేవలు దాదాపు రూ.7 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇది కూడా ఆదాయానికి ఓ ప్రధాన మార్గంగా మారింది. ఇవన్నీ ఓ ఎత్తు. హోటళ్లు, ధర్మశాలలు, తినుబండారాలది మరో ఎత్తు. వీటి ద్వారా ఏకంగా 100 కోట్ల ఆదాయం వచ్చిపడుతోంది. ఇందులో, ప్రభుత్వ నిర్వహణలోని గర్హ్వాల్ మండల్ వికాస్ నిగమ్ (GMVN) బుకింగ్‌లు మరియు ఇతర సేవల ద్వారా రూ.3.8 కోట్లు వస్తున్నాయి.

జిల్లా అధికారుల ప్రకారం, జూన్ 1 నాటికి, సగటున రోజుకు 24,000 మంది యాత్రికులు కేదార్‌నాథ్ మందిరాన్ని సందర్శించారని తెలిపారు. ఈ తీర్థయాత్ర కేవలం ఆధ్యాత్మిక శక్తి మాత్రమే కాదని, ఆర్థిక పునరుజ్జీవనానికి ఓ చోదక శక్తిగా నిలుస్తోందని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాత్ర ఇక్కడి ప్రాంత ప్రజలకు ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా మారిందని, యాత్రికులు తమ ఆధ్యాత్మికతను జోడిస్తూనే, స్థానికంగా ఆర్థిక వ్యవస్థను కూడా ఉద్ధరిస్తున్నారని ప్రకటించారు.

స్థానిక వ్యాపారులు, హోటళ్ల యజమానులు, ఆహార విక్రేతలు మరియు రవాణా నిర్వాహకులు ఇటీవలి సంవత్సరాలలో ఇది అత్యంత సంపన్నమైన సీజన్లలో ఇదీ ఓ సీజన్ అని పేర్కొంటున్నారు.COVID-19 మహమ్మారి సమయంలో వారు ఎదుర్కొన్న ఆర్థిక నష్టాల నుండి కోలుకోవడానికి ఇది ఉపకరిస్తుందన్నారు.అయితే.. ఆర్థిక లాభాలు బాగానే వున్నా.. యేటికి యేడాది భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో పర్యావరణ సవాళ్లతో పాటు రవాణా సవాళ్లు కూడా వచ్చిపడుతున్నాయి. అలాగే హిమాలయాల పర్యావరణ వ్యవస్థను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఇదే భక్తులపై వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *