దేవాలయాల్లో ఫ్లెక్సీలా? కేరళ హైకోర్టు ఆగ్రహం
దేవాలయాల ఆవరణలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తిరువితంకూర్ దేవస్థానం బోర్డును తీవ్రంగా తప్పుబట్టింది. దేవాలయ ఆవరణలో దేవస్వం బోర్డు వారైనా, మరెవ్వరైనా సంబంధించిన ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కె. నరేంద్రన్ స్పష్టం చేశారు. దేవస్థానం ఏమైనా రోడ్డు అనుకుంటున్నారా? అని హైకోర్టు మండిపంది. ఈ ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఫొటోలతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల, ఇతర రాజకీయ నేతల ఫొటోలు వున్నాయి. తిరువింతకూర్ దేవస్థానం ప్లాటినం జుబ్లీ వేడుకల సందర్భంగా వీటిని ఏర్పాటు చేశారు. ఇలాగే మరికొన్ని దేవాలయాల్లో కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకులను ముఖ్యమంత్రి పినరయ్ ప్రారంభిస్తారు. మరోవైపు ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై హైకోర్టుతో పాటు భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందిరాల లోపల ఫ్లెక్సీల వంటివి ఏర్పాటు చేయవద్దని జస్టిస్ అనిల్ కె నరేంద్రన్ నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. మందిరాలు అత్యంత పవిత్రమైనవని, అవి వున్నవి ప్రదర్శనల కోసం కాదని చురకలంటించింది. దేవస్థానం బోర్డుకి సంబంధించిన ఫెక్ల్సీలే అయినా.. మందిరంలో ఏర్పాటు చేయడం సరికాదని, ఆలయ పవిత్రతకు భంగం కలిగించడమే అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
అసలు ఈ విషయాన్ని బయటపెట్టింది జనం అనే మలయాళ టీవీ ఛానల్. ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా దేవాలయాల్లో ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయాలని తిరువితంకూరు దేవస్వం బోర్డు అధికారికంగా ఉత్తర్వులిచ్చింది. దీంతో అడ్డూ అదుపు లేకుండా దేవాలయం లోపల ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ వ్యవహారం హైకోర్టుకి వెళ్లడంతో కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. కేరళలోనే కాదు.. ఎక్కడ కూడా కమ్యూనిస్టులు హిందూ భావజాలాన్ని, సంప్రదాయాలను, నమ్మకాలను గౌరవించరు. సరికదా.. వాటిని అవమానపరుస్తారు. కేవలం హిందూ ధర్మం విషయంలోనే ఇలా చేస్తారు. పైగా సెక్యులరిస్టులం అని చెప్పుకుంటారు.