మొక్కలు నాటకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు.. వీపుకు సిలిండర్‌తో అవగాహన

రానూ రానూ పర్యావరణ సమతౌల్యం పట్టుతప్పుతోంది. ముఖ్యంగా చెట్లు విపరీతంగా తగ్గిపోవడంతో నానా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ఏన్కూర్‌ గ్రామంలో ఓ యువకుడు అందరికీ కనువిప్పు కలిగేలా ప్రదర్శన చేస్తూ తిరుగుతున్నాడు. ‘‘మొక్కలు నాటండి… పర్యావరణాన్ని కాపాడండి’’ అంటూ తిరుగుతున్నాడు. వన సేవకుడిగా అక్కడ గుర్తింపు పొందిన కొంటు సాంబయ్య అనే యువకుడు అందరూ మొక్కలు నాటాలని చైతన్య పరుస్తున్నాడు. మొక్కలు నాటకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయని, ప్రతి ఒక్కరూ ఆక్సిజన్‌ సిలిండర్‌ వీపున వేసుకు తిరుగాల్సి వస్తుందంటూ ఓ బోర్డు మెడలో వేసుకొని, అందర్నీ మేల్కొల్పుతున్నాడు. వీపున ఓ పెద్ద వాటర్‌ బాటిల్‌ తగిలించుకొని, అందులో మొక్కలు పెట్టి, ఆ వాటర్‌ బాటిల్‌ నుంచి ఆక్సిజన్‌ పైపు ముఖానికి పెట్టుకొని, అందరినీ మేల్కొల్పుతున్నాడు. వృక్షో రక్షతి రక్షిత: అంటూ రాసుకొని, అందర్నీ మేల్కొల్పుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *