నల్లమల అడవిలో కోటి ”విత్తన బంతులు” చల్లే కార్యక్రమం
నల్లమల అడవి, కారంపూడి అడవి పరిధిలో కోటి విత్తన బంతులు చల్లే కార్యక్రమం సాగింది. స్థానిక ఉద్యోగులు, పర్యావరణ ప్రేమికులు అందరూ కలిసి విత్తన బంతులు చల్లే కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అడవుల శాతం వృద్ధి చేయాల్సిన అవసరం అందరిపైనా వుందన్నారు. 33.3 శాతం అడవులు వృద్ధి కోసం అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అడవులు, ప్రకృతి వృద్ది శాతం అనేది విత్తన బంతులు చల్లడం ద్వారా తేలికగా అవుతుందని, ఇదో మార్గం అని వివరించారు. తొలకరి జల్లులు, వర్షాకాలంలో విత్తన బంతులు చల్లడం అనేది ప్రతి ఒక్కరూ ఆనవాయితీగా పెట్టుకోవాలన్నారు.