కొత్తిమీర

–  ధనియాల లేత మొక్కలని మనం కొత్తిమీర అంటాము.

–  వీటి రుచి కారంగా మరియు వాసన సుగంధభరితంగా ఉండును.

– కొత్తిమీర గాఢ కషాయంలో పాలు, పంచదార కలిపి ఇస్తే నెత్తురు పడే మూలశంఖ అనగా రక్తంతో కూడిన మొలల వ్యాధి, అజీర్ణ విరేచనాలు , జఠరాగ్ని తగ్గుట , కడుపులో గ్యాస్‌ సమస్య వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది .

– కొత్తిమీర శరీరంలో మూడు దోషాల పైన పనిచేస్తుంది. దాహం ఎక్కువ అయ్యే సమస్యని పోగొడుతుంది. భ్రమ ని తగ్గిస్తుంది. కొత్తిమీర మంచి జీర్ణకారి.

–  కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్లలో వేస్తే నేత్రరోగాలు నయం అవుతాయి. లేదా కొత్తిమీర వెచ్చచేసి కళ్ళకి వేసి కట్టినా సమస్య తీరుతుంది.

– నోరు పూసినప్పుడు కొత్తిమీర రసంతో పుక్కిలిస్తే అద్భుతంగా పనిచేస్తుంది.

–  ఈ కూర వండుకుని తినటం, దీనిని కూరల్లో వాడటం వలన మూత్రాన్ని బాగా జారీచేస్తుంది.

–  దీనిని తరచుగా తీసుకోవడం వలన మెదడులో వేడిని తగ్గిస్తుంది.

–  దీని ఆకు అవునేయ్యితో వేయించి కొంచం కనురెప్పలు మూసుకొని కనులపై వేసి కట్టిన నేత్రసమస్యలు నివారణ అవుతాయి.

 గమనిక: గ్రహణి రోగంతో భాధపడేవారు కొత్తిమీర ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు.

– ఉషాలావణ్య పప్పు  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *