శ్రీకృష్ణం వందే జగద్గురుమ్
దేవకీ వసుదేవుల కుమారుడైన శ్రీకృష్ణుడు, దేవకీ దేవి ఎనిమిదో గర్భంగా ద్వాపర కలియుగ సంధికాలంలో శ్రావణ మాస బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి తిథి నాడు అర్థరాత్రి సమయంలో కంసుడి చెరసాలలో జన్మించాడు. శ్రీకృష్ణ జన్మదినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీన్ని జన్మాష్టమి అని అంటాం. దీన్నే గోకులాష్టమి, శ్రీకృష్ణజయంతి, శతమానం అని పిలుస్తారు. శ్రీ జయంతి అని కూడా అంటారు. కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యతనిస్తే, మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యతను ఇస్తారు. ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభించడం ఆనవాయితీ. ఈ దినం పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు.
హిందూ సమాజంలో ఐక్యతను సాధించేందుకు 1964లో శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు రెండవ సర్‌సంఫ్‌ుచాలక్ శ్రీ గురూజీ నేతృత్వంలో ముంబై మహానగరంలోని సాందీపని ఆశ్రమంలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) పురుడు పోసుకుంది. దాదాపు 17 ప్రధాన విభాగాల్లో హిందూ జీవన విధానంపై ప్రపంచానికి అవగాహన కల్పిస్తోంది. కశ్మీర్ నుండి కన్యాకుమారీ వరకు అనేక కార్యక్రమాలను నిర్వహించింది.