తొలిరోజే కోటిన్నర భక్తుల పుణ్య స్నానాలు
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండగ మహా కుంభమేళా ప్రారంభమైంది. తొలి రోజే 1.65 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ విషయాన్ని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. జైశ్రీరాం, హరహర మహదేవ్, జై గంగామయ్యా అంటూ సాధువులు, అఖారాలు నినాదాలు చేస్తూ మహా కుంభకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎటు వైపు చూసినా జనమే జనం. అంతలా కుంభమేళాకి ప్రజలు తరలిచ్చారు. అయితే.. ఎముకలు కొరికే విపరీతమైన చలి.. చల్లని నీరు.. అయినా భక్తుల ఉత్సాహం, భక్తి ఎక్కడా తగ్గలేదు. అందరూ పవిత్ర జలాల్లో పుణ్య స్నానాలు ఆచరించి, నదీమ తల్లికి నమస్కారాలు చేసుకున్నారు. తొలి విడత స్నానాల్లో పాల్గొన్న భక్తులపై యూపీ ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపింంచి, స్వాగతం పలికింది. మరోవైపు మకర సంక్రాంతి సందర్భంగా 13 అఖారాలతో పాటు దేశ నలుమూలలకు చెందిన పలు ఆధ్యాత్మక పీఠాల అధిపతులు, సాధు సంతులు తొలి షాహీస్నాన్ చేయనున్నారు.