ముస్లింల ఆక్రమణలోని భూమి స్వాధీనం

ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించే దిశగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు దరాంగ్‌ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల్లో భారీగా ఉన్న ఆక్రమణలను తొలగించి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంది. దాదాపు 1488 ఎకరాల ప్రభుత్వాన్ని భూమిని ఆక్రమణల నుంచి తొలగించి ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది. జిల్లా యంత్రాంగం పోలీసులు, పారామిలటరీ బలగాల సహాయంతో ఈ పని పూర్తి చేశారు. 4500 బిగాల భూమిని 800 మంది వలస ముస్లిం కుటుంబాలు చట్ట విరుద్దంగా ఆక్రమించాయి.

దశాబ్దాలుగా ముస్లింలు ఈ భూములను అక్రమించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పదేపదే నోటీసులు ఇచ్చినా కూడా భూములు ఖాళీ చేయలేదు. దీంతో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టినట్టు ఒక అధికారి తెలిపారు. సిపజార్‌ నియోజకవర్గం పరిధిలోని దరాంగ్‌ జిల్లాలోని ధల్పూర్‌ ప్రాంతంలో ఆక్రమణ లను అధికారులు తొలగిం చారు. దీంతో దల్పూర్‌ ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న మరో 300 అక్రమ నివాసాలు తొలగింపు చర్యలు నిలిపివేయాలని కొందరు గౌహతి హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ వ్యక్తులు దాదాపు 9000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.

ఆక్రమణలు తొలగించిన ఈ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం మెగా వ్యవసాయ ప్రాజెక్టును చేపట్టనుంది. ‘గోరుఖుతి వ్యవసాయ ప్రాజెక్ట్‌’ అని పేరు పెట్టిన ఈ ప్రాజెక్ట్‌ ద్వారా స్థానిక యువతను లాభదాయకమైన వ్యవసాయ, వ్యాపారాలలో నిమగ్నం చేయనుంది. స్థానిక ఎమ్మెల్యే పద్మ హజారికా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కమిటీ ద్వారా ఇప్పటి వరకు 500 మంది యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చింది. వారు గోరుఖుతి అగ్రి ప్రాజెక్ట్‌ కింద ఈ భూముల్లో వ్యవసాయం ప్రారంభించనున్నారు.

గోరుఖుతి వ్యవసాయ ప్రాజెక్టు సమన్వయకర్త ఎమ్మెల్యే పద్మ హజారిక మాట్లాడుతూ ఇప్పటివరకు 7,000 బిగాల భూములు ఆక్రమణ నుండి విముక్తం చేశారని తెలిపారు. భూములను పూర్తిగా స్వాదీనం చేసుకునే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక యువతతో కూడిన వ్యవస్థీకృత వ్యవసాయ విప్లవాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *