లష్కరే తోయబా కీలక కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రిది హతం
ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబా కీలక కమాండర్ షేక్ యూసుఫ్ అఫ్రిది హతమయ్యాడు.ఖైబర్ ఫక్తూన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో హతమయ్యాడు.లష్కరే తోయబా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కి అఫ్రీది అత్యంత సన్నిహితుడు. ఖైబర్ పఖ్తూన్ ప్రావిన్స్ లో లష్కరే తోయబా కార్యకలాపాల పర్యవేక్షణలో అఫ్రీది కీలక పాత్ర పోషిస్తున్నాడు. షేక్ అఫ్రీదిని హత్య చేయడమే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు విచ్చలవిడిగా అతనిపై కాల్పులు జరిపారు.ఇది పక్కా ప్రణాళికతోనే జరిగిందని అంటున్నారు.
గత కొన్ని రోజులుగా పాక్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదులపై రహస్యంగా, గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు దిగుతున్నారు. తాజాగా అఫ్రీది హతమవ్వడం కూడా ఇదే కోవలోకి వస్తుంది. అంతర్జాతీయ ఉగ్రవాదులకు స్థావరంగా పాకిస్తాన్ స్థావరమని అందరికీ తెలిసిందే. ఓ క్రమ పద్ధతిలో ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమవుతూనే వున్నారు.
ఏప్రిల్ 16 న లాహోర్ లో లష్కరే తోయబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. లష్కరే తోయబా సీనియర్ కమాండర్ హమ్జా. ఈ దాడిలోనే హతమైనట్లు ప్రకటనలు కూడా వచ్చాయి. మార్చిలో జరిగిన మరో దాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు మహ్మద్ తాహిర్ అన్వర్ కూడా హతమయ్యాడు. మరో సీనియర్ లష్కర్-ఎ-తైబా ఉగ్రవాది అయిన అబు ఖతల్ అలియాస్ ఖతల్ సింధీ పాకిస్థాన్‌లో హతమయ్యాడు. 2024లో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఘోరమైన రియాసి ఉగ్రదాడితో ఖతల్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
2023 నుండి, లష్కర్-ఎ-తైబా, హిజ్బుల్ ముజాహిదీన్ మరియు జైష్-ఎ-మహ్మద్ సంస్థలతో సంబంధం ఉన్న పలువురు ఉగ్రవాదులు కాల్పుల్లో మరణించడం, అదృశ్యం కావడం లేదా అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది.2026లోనే, లాహోర్, కరాచీ వంటి నగరాలతో పాటు పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద సంబంధాలు కలిగిన దాదాపు 30 మంది వ్యక్తులు లక్ష్యంగా వున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.