ఆకు కూరలు – ఔషధ గుణాలు
ప్రకృతి అనేక రకాల ఆహారపదార్థాలను మనకి ప్రసాదించింది. వాటిని సంపూర్ణంగా వినియోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడు కోవాలి. కొన్ని రకాల వ్యాధులకు గురైనపుడు ఆయా రకాల ఆకుకూరలు తీసుకోవడం వలన కూడ శరీరానికి పుష్కలంగా విటమిన్స్ లభించి రోగ నిరోధక శక్తి పెరిగి ఆ వ్యాధి నుంచి తేలికగా బయటపడొచ్చు.
అవిసె ఆకు కూర
– ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఎరుపు, తెలుపు రకాలను వాటి పువ్వులనుబట్టి చెప్పవచ్చు.
– ఏకాదశి మొదలయిన ఉపవాసాల్లో ఉన్నవారు ఈ ఆకుకూరని తప్పకుండా ఉపయోగిస్తారు. ఉపవాసం వల్ల వచ్చిన నీరసాన్ని ఇది చాలా బాగా తగ్గిస్తుంది.
– దీని ఆకులు నూరి చర్మం మీద పట్టుగా ఉపయోగిస్తారు. గాయాలకు, దెబ్బలకు మంచి మందు.
– జలుబు, రొంప ఉన్నప్పుడు అవిసె ఆకుల రసాన్ని కొన్ని చుక్కలు ముక్కులో వేసుకుంటే రొంప, తలనొప్పి తగ్గుతాయి. చిన్నపిల్లలకు ఈ ఆకురసంలో తేనె కలిపి వాడాలి.
– పురిటిబిడ్డలలో జలుబు ఎక్కువుగా ఉంటే రెండు చుక్కల అవిసె రసంలో 10 చుక్కల తేనె వేసి రంగరించి ముక్కులలో వేలితో పైపైన రాస్తారు.
– ఈ అవిసె ఆకులు కారంగా, కొంచం చేదుగా ఉంటాయి. కడుపులోని నులిపురుగుల్ని హరించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మధ్య మార్కెట్లో అవిసె కారం దొరుకుతోంది.
– సాలీడు, పులికోచ మొదలైన జంతువుల విషాన్ని కూడా ఈ ఆకురసం విరిచేస్తుంది.
– అవిసె ఆకుల రసం టాన్సిల్స్‌కి పూస్తే అవి కరిగిపోతాయి.
– ఉషాలావణ్య పప్పు