ఆషాఢం ఆకు కూరలు

చెంచలి కూర
– ఏ ఆకు కూరలు దొరకని ఆషాడ మాసంలో ఈ ఆకుకూర దొరుకుతుంది.
– ఎందుకనో ప్రజలు దీనిగురించి ఎక్కువ పట్టించుకోరు.
– దీనిలో చెంచలికూర, నీరు చెంచలి కూర అని రెండురకాలు. సాదారణంగా చెంచలి కూరనే వంటకానికి వాడతారు.
– ఇది మలాన్ని గట్టిపరుస్తుంది.
– మేహం, త్రిదోషాన్ని పొగొడుతుంది.
మునగాకు
– ఆషాడ మాసంలో మునగాకు కూర తినాలని పెద్దలు చెపుతారు.
– మునగాకులో 5,000 యూనిట్ల A విటమిన్‌ ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
– జఠరాగ్నిని పెంచుతుంది.
– కఫాన్ని, వాతాన్ని హరిస్తుంది.
– రక్తములో వేడి పెంచుతుంది కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిది.
– దృష్టిదోషాన్ని పోగొడుతుందని చెబుతారు.
– శరీరంలో చెడ్డ నీరు తొలగించదానికి మునగాకు కూర చాలాబాగా పనిచేస్తుంది.

– ఉషాలావణ్య పప్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *