మట్టిని కాపాడుకుందాం …
భూమి సుపోషణ – భూసార సంరక్షణ -పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామ భారతి తెలంగాణా ఆధ్వర్యం లో ఉగాది పర్వదినం నుండి జన జాగరణ ఉద్యమం ప్రాంభమైంది. ఇందులో కొన్ని ధార్మిక సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. భూసారాన్ని కాపాడుకోవడంలో ప్రతి రైతు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని, క్రింది విషయాలు గమనించాలని ఈ సందర్భంగా గ్రామ భారతి పిలుపునిస్తోంది.
భూమి సుపోషణ – పర్యావరణ సంరక్షణ : ఆవశ్యకత
- భూమి సుపోషణ తో భూసార సంరక్షణ పర్యావరణ పరిరక్షణతో.. జీవ వైవిధ్యాన్ని కాపాడాలి.
- చెట్లు, ఔషధ మొక్కలు, పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, మిశ్రమ పంటలతో భూమికి బలం.
- గో పోషణ, పశుపోషణ, ఎద్దుల వ్యవ సాయంతో భూమికి కడుపునిండా ఆహారం లభిస్తుంది.
- భూమిలో వాన పాముల సంచారంతో నేల గుళ్లగా తయారగుట, నీటిధారలు ప్రవహించుట.
భూమి సుపోషణ – భూసార సంరక్షణ : గ్రామాలలో చేయాల్సిన పనులు
- ఉగాది పండుగ లేదా మరొక రోజు భూమి పూజ, భూ సుపోషణ గూర్చి సంకల్పం చేయడం.
- వేసవిలో లేదా ఒక్కొర్టు పంటకు మధ్య భూమికి విశ్రాంతి. భూమిని ఎండతాకిడి నుండి కాపాడటం.
- భూమికి అచ్చారన (మల్చింగ్) మరియు రాప్ప (నీరు, తేమ సంతులనం).
- భూమిలో అంతటా వానపాములు, కోటాను కోట్ల జీవరాశుల సంచారానికి సహకరించడం.
- గోపోషణ, పశుపోషణ, పొలంలో పశువుల మందలు, ఎద్దులతో వ్యవసాయం.
- నవధాన్యాలు, పప్పు ధాన్యాలు, స్వల్పకాలికి పంటలు, పచ్చి రొట్టలతో భూమికి మేలు.
- సేంద్రియ ఎరు వులు, గో కృపామృతం, బీజామృతం, జీవామృతంలతో నేలకు సమృద్ధి ఆహారం.
- చెరువు మట్టి, మట్టి ద్రావణం, ప్రాకృతిక కీటక నియంత్రణ కషాయాల వినియోగం.
- మిశ్రమ పంటలు, పంట మార్పిడిని రైతులు తమ గ్రామానికి కావలసినన్ని పంటలు పండిరచడం.
- భూసారం, నీటి వనరులు, వర్షాలు, వాతావరణం.. వీటి ఆధారంగా పంటల విధానం. రైతులు తమకు కావలసిన దేశవాళీ విత్తనాలు స్వయంగా తయారు చేసుకోవాలి.
- తమ పొలంలో పడ్డ వర్షపు నీరు పొలం లోనే.. గ్రామంలో పడిన వర్షపు నీరు గ్రామం లోనే ఉండేట్లు చూసుకోవడం.
- పాలంలో కాంటూర్ పద్ధతిలో నీటిని నిలిపే విధంగా గట్లు వేసి, అధిక పంటలు పండిరచడం.
- పొలం గట్లపైన ఉపయోగకరమైన చెట్లు, గడ్డిని పెంచే విధంగా ఏర్పాటు చేసికోవడం.
- వ్యవసాయం పనులకు, కలుపు తీయడానికి చేతితో, పశువులతో నడిచే చిన్న యంత్రాలు వినియోగించడం.
- యజమానులు తమ కుటుంబ సహితంగా కూలీలతో కలసి పొలం పనులు చేయడం.
- తమ పొలాన్ని, ఇంటిని, వీధిని, గ్రామాన్ని, ధార్మిక, సామాజిక స్థలాలను పర్యావరణ పోషకంగా ఉంచుకోవడం.
- ఆహార వస్తువుల విలువ, విత్తనాల భద్రత కోసం ప్లాస్టిక్ పాలిథిన్ రహిత పాత్రలు, గోనె సంచులు, గుడ్డ సంచులను ఉపయోగించడం.
- సృష్టి, పర్యావరణం, ప్రాణుల సంరక్షణ వల్లనే మానవ వికాసం సాద్యపడుతుంది.