ఇస్లామిక్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విధుల నుంచి తొలగించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 (2) (సి)ని ఉపయోగించి, వీరిని విధుల నుంచి తొలగించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తొలగించబడిన వారిలో కర్నా ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఖుర్షీద్ అహ్మద్ రాథర్, గొర్రెల పెంపకం విభాగంలో అసిస్టెంట్ స్టాక్ మేన్ గా వున్న సియాద్ అహ్మద్ ఖాన్ వున్నాడు.
ఈ ఇద్దరు కూడా ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు నెరుపుతున్నారని, ఆయుధాల అక్రమ రవాణాలో కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారని భద్రతా సంస్థలు తెలిపాయరు. అలాగే నియంత్రణ రేఖ (LOC) వెంబడి LeT హ్యాండ్లర్లతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నారని కూడా పేర్కొన్నారు. అహ్మద్ రాథర్ పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి, ఉగ్రవాద విస్తరణకు సహాయకునిగా మారినట్లు తేలింది. ప్రస్తుతం వీరిద్దరూ కుప్వారాలోని జైలులో వున్నారు.
ఖుర్షీద్ అహ్మద్ రాథర్ :
2003 లో కాంట్రాక్ట్ బేస్ కింద ఉపాధ్యాయునిగా చేరాడు. 2008లో పర్మినెంట్ అయ్యాడు.ఖుర్షీద్ లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు OGWగా పనిచేస్తున్నాడు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సింది పోయి, ప్రభుత్వ జీతం పొందుతూ, ఖుర్షీద్ ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.కశ్మీర్ లోయలో వున్న ఇస్లామిక్ ఉగ్రవాదుల ద్వారా, పాక్ లో వుంటున్న ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా చేస్తున్నాడు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, మాదక ద్రవ్యాలను పంపించే పనిలో వున్నాడు.అతను పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లు మంజూర్ అహ్మద్ షేక్ అలియాస్ షకూర్ మరియు జావిద్ అహ్మద్‌లతో నిరంతరం సంప్రదింపులు చేస్తూనే వున్నాడు.
సియాద్ ఖాన్ :
2004 లో గొర్రెల పెంపకం విభాగంలో పనిచేస్తున్నాడు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థతో టచ్ లోకి వెళ్లాడు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఆయుధాలు సరఫరా చేయడం లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లు మంజూర్ అహ్మద్ షేక్ అలియాస్ షకూర్ మరియు జావిద్ అహ్మద్‌లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *