పైత్యాన్ని తగ్గించి, మల బద్ధకం దూరం చేసే బొప్పాయి
బొప్పాయి పండు పైత్యాన్ని తగ్గిస్తుంది.
మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
స్తన్యవృద్ధిని చేస్తుంది.
హృదయానికి చాలా మంచిది
బొప్పాయి కాయను కూరగా చేసి ఇస్తే.. తల్లుల్లో స్తన్యము వృద్ధి చెందుతుంది.
బొప్పాయి పాలు, బెల్లం కలిపి తినిపిస్తే నులిపురుగులు నశిస్తాయి.
బొప్పాయి పాలు ముసాంబరం కలిపి నూరి, శనగ గింజంత మాత్ర ఇస్తే స్త్రీలలో ఋతురక్తం జారీ అవుతుంది.
బొప్పాయి ఆకులను మెత్తగా దంచి, పసుపు కలిపి, పైన పట్టు వేస్తే బోదకాలు తగ్గుతుంది.
గర్భిణీలకు బొప్పాయి తీసుకుంటే గర్భస్రావం కలుగుతుంది.
ఇంగ్లాండులో బొప్పాయితో చేసిన ఔషధాన్ని గర్భస్రావం కలిగించే నిమిత్తం, గర్భనిరోధకంగా వాడుతున్నారు.