లౌకికత్వము, జాతీయత రెండూ ఎన్నడూ ఒకటి కాజాలవు
లౌకికత్వమును, జాతీయతనూ ఒకటిగా భావించే భ్రమ ఒకటున్నది. ఈ రెండూ ఎన్నడూ ఒకటి కాజాలవు. ‘‘జాతి’’ అనేది సమగ్రమూ, సజీవమూ అయిన విషయం. దానికి అనేక విధులు ఎప్పుడూ వుంటుంటాయి. దానిలో రాజ్య వ్యవస్థ ఒకటి. ‘‘లౌకికత్వం’’ అనేది రాజ్య వ్యవస్థ లక్షణాలలో ఒకటి మాత్రమే. ఆ విధంగా, అలాంటి లౌకికత్వమూ, జాతీయతను ఒకటే అనడం, శరీరంలోని ఒక అవయవం చేసే పనిని, యావత్తూ శరీరంతో సమానమనడం వంటిదే అవుతుంది. అంతే కాదు.. జాతికి రాజ్యానికీ నడుమనున్న మౌలికమైన వ్యత్యాసం బొత్తిగా తెలియదని ప్రకటించుకోవడమే అవుతుంది.లౌకికం అంటే మత వ్యతిరేకత కాకూడదు. ప్రతి మత సంప్రదాయం వికసించేందుకు, అనుకూలత, అవకాశం అందులో వుండాలి.
-మాధవ రావు సదాశివ గోల్వాల్కర్