ధాత్రీఛాయాం సమాశ్రిత్య
‘‘ధాత్రీఛాయాం సమాశ్రిత్య
కార్తికేన్నం భునక్తియ:
అన్నం సంసర్గజం పాపం
ఆవర్షం తస్య నశ్యతి’’
కార్తిక మాసంలో ధాత్రీ వృక్ష ఛాయలో భోజనం చేసే వారికి సంవత్సరమంతా అన్న సంసర్గజమైన పాపం నశిస్తుంది. అందుకే కార్తిక మాసంలో ఏకాదశినాడు ఉపవసించి, ద్వాదశి నాడు తులసీధాత్రీ సహితమైన వనంలో పారణ చేసినందున, దీనితో పాటు సద్బ్రాహ్మణుని సత్కరించి, మంచి భోజనంతో అతనిని తృప్తిపరిచిన, కార్తిక దామోదరుని అనుగ్రహం లభిస్తుంది.