అమరవాణి తతో భూయ ఇవతో తమో య ఉ విద్యాయాం రతా: 2024-04-13 editor 0 Comments ”అన్ధ: తమ: ప్రవిశన్తి యే అవిద్యా ముపాసతే తతో భూయ ఇవతో తమో య ఉ విద్యాయాం రతా:” ఎవరైతే కేవలం అవిద్యను, అనగా సంసారాన్ని ఉపాసిస్తారో అలాంటి వారు అంధ తమసంలోకి ప్రవేశిస్తారు. ఎవరైతే కేవలం బ్రహ్మ విద్యలోనే నిమగ్నులవుతారో వారు అంత కంటే ఎక్కువ అంధకారంలోకి ప్రవేశిస్తారు. -ఈశావాస్యం