రక్తశుద్ధికీ, కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడే బీరకాయ
జ్వరం వచ్చి, తగ్గిన వారికి బీరకాయ కూరతో పథ్యం పెడతారు.
బీరపాదు మొత్తం ఔషధపూరితం.
సాధారణ బీర, నేతి బీర… ఈ రెండు రకాల బీరకాయల్లోనూ పీచు, విటమిన్‌సి, జింక్, ఐరన్, రిబోఫ్లేవిన్, మెగ్నిషియం, థయామిన్ వంటి పోషకాలు మెండుగా వుంటాయి.
సెల్యులోజ్ ఎక్కువగా వుండటంతో ఇది మలబద్ధకాన్నీ, మొలల వ్యాధిని బాగా నివారిస్తుంది.
కాయల్లోని పెప్టెయిడ్, ఆల్కలాయిడ్‌లూ రక్తంలోనూ, మూత్రంలోనూ వుండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గిస్తుంఇ.
మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిని పెంచడం ద్వారా చక్కెర వ్యాధినీ నియంత్రిస్తుంది.
రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.
కామెర్లు సోకిన వారు బీరకాయ రసం తాగడం వల్ల మంచి ఫలితం వుంటుంది.
బీరకాయ రసం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అల్సర్లూ మంటలతో బాధపడే వారికి ఈ కాయ మందు.
కంటి కండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని కాయలో వుండే విటమిన్`ఎ నివారిస్తుంది.
బీరపాదు ఆకులు మెత్తగా నూరి, రసం తీసి కళ్లలో వేస్తే కళ్ల మంటలు, కంజెక్టివైటిస్ తగ్గుతాయి.
అరుచిని పోగొడుతుంది.
లేత బీరపొట్టు వేపుడు జ్వరం పడి లేచిన వారికి హితవుగా వుంటుంది.