ఆహారం జీర్ణం చేసి, బాగా ఆకలి వేసేట్లు చేసేడి జీలకర్ర
జీలకర్ర ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.
ఆకలి బాగా వేసేట్లు చేస్తుంది.
కడుపు నొప్పిని, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
మూత్రాశయంలో రాళ్లను తొలగించేస్తుంది.
గర్భాశయ దోషాలను పోగొడుతుంది.
ఆహార పదార్థాల్లో గల విష దోషములను కూడా పోగొడుతుంది.
కంటికి బాగా మంచిది.
ఆహార పదార్థాలకు రుచిని కలిగించును.
విరేచనాలు, జిగట విరేచనాలు బాగా పెరిగితే… జీలకర్ర తీసుకుంటే తగ్గిస్తుంది.
నులి పురుగులను నిర్మూలిస్తుంది.
చర్మరోగాలను తగ్గిస్తుంది.
జీలకర్ర పొడిని బెల్లంతో కలిపి తీసుకుంటే విషమ జ్వరం, వాతరోగాలు తగ్గును.
జీలకర్ర, ధనియాలును నేతితో కలిపి తీసుకుంటే ఆమ్ల పిత్తము, అరుచి, వాంతులు తగ్గిపోతాయి.