చేదుగా వున్నా… ఔషధ గుణాలు పుష్కలం
కాకరకాయ ఆకలిని బాగా పెంచుతుంది.
కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
నులి పురుగులను సైతం నశింపజేస్తుంది.
శరీరంలో వున్న అధిక కొవ్వును తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.
విటమిన్ ఏ, రిబో ప్లవిన్ విటమిన్ సీ ధాతువులు ముఖ్యంగా ఐరన్ వంటివి వుంటాయి.
మలబద్దకాన్ని నివారించే గుణం దీనికి వుంది.
కేన్సరన లాంటి దీర్ఘ వ్యాధులను తగ్గిస్తుంది.
సోరియాసిస్ వ్యాధిని నివారించడంలో మంచి ఫలితాలనిస్తుంది.
రోజు విడిచి రోజు తింటే రక్త ప్రసరణ చక్కగా జరిగి, కొవ్వు కరిగి, బరువు తగ్గుతారు.
రక్తపోటు కూడా నియంత్రణలోనే వుంటుంది.
వారంలో ఓసారి బెల్లం, చింతపండుతో కలిపి తింటే ఆకలి పెరిగి, అజీర్ణం తగ్గుతుంది.
కాకరకాయ రసం తాగడం వల్ల డయాబెటిస్ అదుపులో వుంటుంది.
గ్లూకోజ్ స్థాయీని కంట్రోల్ అవుతాయి.
కాకర కాయ జ్యూస్ వుండే ఔషధ గుణాలు ఇన్సులిన్ లా పనిచేస్తాయి.
కంటి శుక్లం, చూపు లోపం వున్న వారికి నివారిణి
అతిసారం, నులిపురుగులు, గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు ఔషధం.
మహిళల్లో గర్భాశయ , రొమ్ము కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.