కఫ, వాత రోగాలను నయం చేసే మిరియాలు
మిరియాలు జీర్ణశక్తిని పెంచుతాయి.
ఆకలిని బాగా పెంచుతుంది.
కఫ, వాత రోగాలను నయం చేస్తాయి.
మిరియాల పొడి 500 మిల్లీ గ్రాములు తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే జలుబు, దగ్గు, అస్టమా తగ్గిపోతుంది.
మిరియాల కషాయమ్ రెండు చెంచాలు తేనెతో కలిపి యిచ్చిన కడుపు నొప్పి, అజీర్ణం, జలుబు, తలనొప్పి పోతుంది.
గొంతు నొప్పి కూడా తగ్గిపోతుంది.
1 గ్రాము మిరియాల పొడి పాలలో కలిపి తాగిన మంచి స్వరం, గాత్ర సౌష్టవం కలుగుతుంది.
1 గ్రాము మిరియాల పొడి, 3 గ్రాముల బెల్లంతో కలిపి ముద్దగా చేసీ , రోజుకు రెండు సార్లు తింటే ఎలర్జీ, ఎలర్జీ వల్ల వచ్చే పడిశము, తుమ్ములు పోతాయి.
మిరియాల పొడి, బెల్లం కలిపి తింటే మూలశంక తగ్గుతుంది.
ప్రతి రోజు ఆహారంలో మిరియాలు, జీలకర్రలతో తయారు చేసిన చారు వాడటం చాలా మంచిది.