గర్భాశయ దోషాలను పోగొట్టే పుదినా
పుదీన రుచిని పుట్టిస్తుంది.
ఆకలిని కూడా పుట్టిస్తుంది.
మలమూత్ర బంధనము చేస్తుంది.
విరేచనాలు, జిగట విరేచనాలను తగ్గిస్తుంది.
నులి పురుగులను నాశనం చేస్తుంది.
కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
గుండెకి బాగా మంచిది.
స్త్రీలకు గర్భాశయ దోశాలను పోగొడుతుంది. రుతు స్రావము సరిగ్గా అయ్యేట్లు చేస్తుంది.
జలుబు, దగ్గును తగ్గిస్తుంది.
సూతికలకు వచ్చు జ్వరములకు పుదీనా ఆకుల రసాన్ని తీసి, రెండు చెంచాలు చొప్పున తాగితే మంచిది.
యూరప్‌లో పుదీనాను మానసిక ఉద్వేగాన్ని తగ్గించడానికి వాడతారు.
జలుబు చేస్తే పుదీనా ఆకును ముద్దగా చేసి, నుదుటకు పట్టిస్తే, జలుబు, తలనొప్పి తగ్గుతుంది.