ప్రతి ఒక్కరూ త్యాగం చేయాల్సిందే. త్యాగం ద్వారానే లాభం పొందుతాం
ప్రతి ఒక్కరూ త్యాగం చేయాల్సిందే. త్యాగం ద్వారానే మనం లాభం పొందుతాం. ఇదే జగత్తు యొక్క అంతర సత్యం. పూవు రేకులను రాల్చాసస వుంటుంది. అప్పుడే ఫలవంతమవుతుంది. ఫలం రాలిపడాల్సిందే. అప్పుడే అది చెట్టు అవుతుంది. గర్భమునందలి శిశువు గర్భాశ్రయమును వీడి భూమిపై జన్మించాల్సి వుంటుంది. జన్మించి, శరీరంలోనూ, మనసఱలోనూ తన లోపలి నుంచి పెరుగుతూ వుంటాడు. అప్పుడు వానికి వేరు కర్తవ్యమేమీ లేదు. వాని ఇంద్రియ శక్తి, వాని బుద్ధి, విద్య ఒక దశకు చేరిన తర్వాత వాడు తిరిగి తనలోనించి సంసవరలోకి జన్మించాలి. జన్మించిన మొదలు.. రకరకాల సవ్థయిలకు వెళ్తూ వుంటాడు. చివరికి మృత్యువు ముఖానికి వచ్చి నిల్చుంటాడు. చివరికి అనంత లోక మధ్యంలో జన్మగ్రహణం చేసవ్తడు. ఈ విధంగా అతడు శరీరం నుంచి సమాజంలోకి, సమాజం నుంచి ప్రపంచంలోకి, ఆధ్యాత్మిక క్షేత్రంలోకి మానవ జన్మకు తుది పరిణతిని చేకూరుతాడు.