మాతృభూమి కొరకు నిర్వహించిన ప్రతిపనీ దేవీ శక్తులకు చెందినదే
భారత మాత కోసం మీ స్వార్థాన్ని త్యజించండి. మన వ్యక్తిగత ధర్మం జాతీయ ధర్మం కన్నా ఎప్పటికీ గొప్పది కాదు. సరైన పాలల్లో ధర్మాన్ని ఆచరించాలి. మాతృభూమి కొరకు నిర్వహించిన ప్రతిపనీ దేవీ శక్తులకు చెందినదే. భారత మాత కొరకు మన సర్వశక్తులను హవిస్సుగా సమర్పించాలి. ఈ యజ్ఞ భావాన్నే భగవద్గీత వివరిస్తుంది. జాతీయ ధర్మం కొరకు వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక ధర్మాలను త్యజించిన ఆదర్శ మూర్తుల సాహసోపేతమైన త్యాగం ముందు ఏదీ నిలబడదు. సరితూగనూలేదు. మీ వ్యక్తిత్వం మొత్తం దేశంతో విలీనమైనప్పుడు మీలో ఒక అద్వితీయ శక్తి నిర్మాణమవుతుంది.