మన దేశ చరిత్ర ఎందుకు చదవాలంటే…
చరిత్ర ఎందుకు చదవాలి? చరిత్ర పునరావృతం కాకుండా చూసుకోవడం. పరిస్థితులు సంఘటనలు తిరిగి తిరిగి రావడం సహజమే. అందుచేత గతం తెలిస్తే భవిష్యత్తును తెలుసుకోవచ్చు. అలాగే గతం నుంచి గుణపాఠాలు కూడా నేర్చుకోవచ్చును. ఒక పరిస్థితి ఉపేక్షిస్తే యుద్ధానికో, సంఘ విచ్ఛిత్తికో, నాగరికత విధ్వంసానికో దారి తీయగలదని చరిత్ర తెలియజేస్తుంది . అలాంటి పరిస్థితులు తిరిగి ఏర్పడితే మనం ముందు జాగ్రత్తలు తీసుకొని ఆ దుర్ఘటనల నుంచి తప్పించుకోవచ్చు. చరిత్ర అంటే రాజ్యాలు, రాజులు, యుద్ధాలు, రాజవంశాలు మాత్రమే కాదు. దురదృష్టవశాత్తు పాశ్చాత్య చరిత్రకారులు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మన పురాణాలలో మాత్రం ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చారు. పురాణాల పఠనం వల్ల రాజ్యపాలన గురించే కాకుండా, అప్పటి ప్రజల సంస్కృతి , నాగరికతల గురించి కూడా చరిత్ర చదివితే తెలుస్తుంది .
-కంచి స్వామి చంద్రశేఖర పరమాచార్య