అందరినీ కలుపుకొనిపోతే భారతదేశ కల్యాణం మాత్రమే కాదు, విశ్వ కల్యాణం సాధించవచ్చు.
ప్రపంచం మొత్తానికి పథ నిర్దేశనం చేయగలిగే జీవన విధానం భారత్‌లో వికసించాలి. సంపూర్ణ ససష్ట యెడల ఏకాత్మ భావన, భేదరహితమైన, సమర్థ రహితమైన భావనతో వుండగలిగే సర్వ సమర్థమైన భారత్‌ను నిర్మించాలి. గడచిన వెయ్యి సంవత్సరాలుగా సత్యం, అహింస మార్గంలో ప్రామాణికంగా ప్రయాణించిన దేశాలలో ఒక భారతదేశాన్ని మాత్రమే ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ దేశంలో వున్న అనేక భాషలు, సంప్రదాయాలు, కులాలు, ఉప కులాలు, ఆహార విహారాదులలో తేడాలు, భౌగోళికంగా వివిధతలు, రీతి, నీతి అన్నిటిలో వివిధత వుంది. ఆ వివిధతను అంగీకరించి సన్మాన పూర్వకంగా స్వీకరించి అందరినీ కలుపుకొనిపోతే భారతదేశ కల్యాణం మాత్రమే కాదు, విశ్వ కల్యాణం సాధించవచ్చు.
-రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్