తల్లిదండ్రులెలా పుట్టుకతో సిద్ధిస్తున్నారో.. మతం కూడా చనిపోయే వరకూ మారే అవకాశం లేదు
తల్లిదండ్రులెలా పుట్టుకతో సిద్ధిస్తున్నారో అలాగే మతం కూడా చనిపోయే వరకూ మారే అవకాశం లేదు. హిందూ తల్లిదండ్రులకు క్రిస్టియన్ కూతురు కుదరని పని. ఒక మతంలో తన పూర్వీకులున్న వారికి అతడికి ఆ మతం మీద నమ్మిక ఉన్నా లేకపోయినా రాబోయే తరాల దృష్ట్యా తన మతం మార్చుకునే అవకాశం లేదు. ఈ విషయం ప్రతి వారికి తెలియజేయాలి. తీవ్రమైన ప్రచారం ద్వారానే ఇది సాధ్యం. వ్యక్తిగతమైన ప్రార్థనలు ఆయా వ్యక్తుల క్షేమం కొరకు ఉపయోగపడతాయి. మన దేశం, మన మతం రక్షింపబడాలంటే సామూహిక ప్రార్థనలు ప్రతి దేవాలయంలో జరగడం అత్యవసరం. గ్రామంలోని నలుమూలల నుండి హిందువులు తన మతాన్ని రక్షించడానికి శక్తియుతుడైన నాయకుడు కావాలని ప్రార్థిస్తూ ఊరేగింపుగా దేవాలయం చేరి ప్రార్థనలు చేయాలి. ప్రార్థనకు శక్తి వుంది. తప్పక ఫలిస్తుంది.
-సద్గురు శివానంద మూర్తి