స్వావలంబనే మన గమ్యం కావాలి
ప్రజలు తమను తాము పోషించుకొను శక్తిమంతులుగా తయారు కాలేనిచో ప్రపంచ సంపదనంతా వెచ్చించినప్పటికీ మన దేశంలో ఒక చిన్న పల్లెలోని ప్రజలు కూడా రక్షింపబడరు. కనుక మనం ప్రజలకు నైతికపరమైన, విజ్ఞానపరమైన విద్యను విధిగా అందజేయాలి. ప్రజలు స్వయంపోషకత్వాన్ని, ఆర్థిక నైపుణ్యాన్ని సంపాదించుకొని కరువుకాటకాల బారిన పడకుండా రక్షించుకుంటూ జీవించగలవారగుటకు కావల్సిన విజ్ఞానాన్ని మనం వారికి లభింపజేయాలి.
-స్వామి వివేకానంద