ప్రతి కణంలోనూ, సృష్టి అంతటా నిండి వున్న శక్తే రాముడు.
రాముడి ఆదర్శాలు ఇప్పటికీ ఆచరణీయాలే. ప్రతి కణంలోనూ, సృష్టి అంతటా నిండి వున్న శక్తే రాముడు. రాముడు అందరి జీవితానికి వెలుగు దివ్వె. రాముడి జీవితం మనందరికీ క్రమశిక్షణ నేర్పుతుంది. విజయం ఎప్పుడూ రాముడితో ముడిపడి వుంటుంది. రామబాణం ఎన్నడూ గురికూడా తప్పదు. అందుకే నేటికీ రామబాణం అనే పదాన్ని సర్వరోగ నివారిణి లేదా ఏదైనా సమస్యకు అంతిమ పరిష్కారం అన్న అర్థంలో వాడుతున్నాం. రాముడు ఏనాడూ ఉపదేశాలివ్వలేదు. అయినా అతని ఆదర్శ జీవనం యుగయుగాలుగా మానవాళికి ఆదర్శంగా ఈనాటికీ నిలిచే వుంది.
_శ్రీ శ్రీ రవిశంకర్