ఏ దేశ రాజకీయ స్వాతంత్య్రానికైనా ప్రారంభంలో ఆ దేశ మనసు, ఆత్మను మేల్కొలపాలి
ఏ దేశ రాజకీయ స్వాతంత్య్రానికైనా ప్రారంభంలో తప్పనిసరిగా ఆ దేశానికి చెందిన మనసు, ఆత్మను మేల్కొలపాలి. అందుకే స్వాతంత్రోద్యమం బలోపేతమై, విజయం సాధించేందుకు డాక్టర్ హెడ్గెవార్ ఈ దేశ ఆత్మను, మనసును మేల్కొలిపే కార్యక్రమాన్ని, సమాజాన్ని ఐక్యం చేసే పనిని మొదలుపెట్టారు.స్వాతంత్ర సాధన కోసం ఇలాంటి కార్యక్రమం అవసరమని, అది తప్పనిసరి అని భావించడం వల్లే ఆయన సమస్త సమాజాన్ని ఒకే దేశవాసులుగా జాగృతం చేసేందుకు, క్రియాశీలం చేసేందుకు, సంపూర్ణ సమాజంలో ఐకమత్యం తీసుకొచ్చేందుకు సంఘను ప్రారంభించడాన్ని గొప్ప విషయంగా అర్థం చేసుకోవాలి.