దైవత్వాన్ని చాలినంత స్థాయిలో ప్రదర్శించని సమయంలోనే వ్యక్తి విఫలమవుతాడు
విశ్వాసం మనలో మనకి విశ్వాసం, భగవంతుని యందు విశ్వాసం వుంటే చాలు, ఉన్నత స్థితిని సాధించామన్నమాటే. మన దేశంలో వున్న మానవులు, అదనంగా ఇతర దేశాల నుంచి వచ్చిన జనులు వీరందరిలో వున్న దేవుళ్ల యందు మనకు విశ్వాసమున్నా మన యందు మనకి విశ్వాసం లేకపోతే మనకు మోక్షప్రాప్తి కలగదు. ఆత్మ విశ్వాసమున్న కొద్ది మంది జీవిత గాథల సంపుటీకరణమే ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసమే వ్యక్తిలోని దైవత్వాన్ని వెలికి తీస్తుంది. ఆ స్థితిలో వ్యక్తి సాధించలేనిది ఏదీ వుండదు. దైవత్వాన్ని చాలినంత స్థాయిలో ప్రదర్శించని సమయంలోనే వ్యక్తి విఫలమవుతాడు.
– స్వామి వివేకానంద