శస్త్రం, శాస్త్రాలను హిందువులలోని అన్ని కులాల వారికి అందుబాటులో వుంచాలి
స్వరాజ్యం లభించినందుకు అందరం ఆనందించడం, ఉత్సవాలు చేసుకోవడం సరైనదే. వర్ణాశ్రమ ధర్మాల పేరుతో కొన్ని కులాల వారికే శాస్త్ర పఠనం అస్త్ర శాస్త్రాలను ధరించే అవకకాశాలు కల్పించడం వంటి కొన్ని చెడు నియమాల వల్లనే భారత్ స్వాతంత్రాన్ని కోల్పోయింది. శస్త్రం, శాస్త్రాలను హిందువులలోని అన్ని కులాల వారికి అందుబాటులో వుంచాలి. ఇది నేటి బాధ్యత. హిందువులు కులానికి గాక, గుణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నేడు నిమ్న కులస్తులుగా భావిస్తున్న వారిపట్ల ఆత్మీయతతో వ్యవహరించాలి. అంటరానితనం ఓ రోగం. ఆచరింపకూడనిది. నిమ్న కులస్తులు తమ సంతానాన్ని విద్యావంతులుగా, సదాచార పరాయణులుగా తీర్చిదిద్దాలి. గోమాంస భక్షణ మహా పాపం. అందుకే మద్యపానం, గోమాంస భక్షణకు దూరంగా వుండాలి.
-మలయాళ స్వామి