భారతదేశంలో తత్త్వశాస్త్రం మానవాత్మపై ఆసక్తి చూపుతుంది
భారతదేశంలో తత్త్వశాస్త్రం మానవాత్మపై ఆసక్తి చూపుతుంది. ఆత్మను తెలుసుకో ` ‘‘ఆత్మానం విద్ధి’’ అనేది యిక్కడి ప్రవక్తల బోధనల సారాంశం. అన్నిటికీ కేంద్రస్థానమైన ఆత్మయే మానవుని లోపలా ఉన్నది. మనోవిజ్ఞానం నీతిశాస్త్రం, మౌలికశాస్త్రాలు. చిత్తవృత్తుల వైవిధ్యం, సూక్ష్మమైన వెలుగునీడల సయ్యాట మొదలైన వివరాలతో మానసిక జీవనం చిత్రితమైంది. భారతీయ మనోవిజ్ఞానం ఏకాగ్రత విలువను గుర్తించింది. సత్యాన్ని దర్శించడానికి అది మార్గమని భావించింది. మన తలపులను, ప్రజ్ఞను ఒక పద్ధతిలో నడిపిస్తే జీవితంలోగాని, మనస్సులో గాని మనం చేరలేని దూరతీరాలు ఉండవని ఈ శాస్త్రం నమ్ముతుంది. మనసుకు, శరీరానికి మధ్య సన్నిహిత సంబంధం ఉందని అది గుర్తించింది.
-డా. సర్వేపల్లి రాధాకృష్ణన్