అంతులేని శక్తికి మనస్సు భాండాగారం… గుర్తిస్తే శక్తిమంతులమే
మనస్సుకి గల శక్తి సామర్థ్యాలు అపారం. అంతులేని శక్తికి అది భాండాగారం. స్వీయ నియంత్రణతో, అంతరవలోకనం చేసినప్పుడు మనం ఆ శక్తిని వెలికి తీసి, పరహితానికి ఆ శక్తిని వినియోగించగలం.మనలో ప్రతి ఒక్కరిలో ఈ శక్తి దాగి వున్నది. దానిని గుర్తించగలిగితే మనం సర్వ శక్తిమంతులమన్నది అనుభవంలోకి వస్తుంది. ఎందరో మహాత్ములు, అవతారపురుషులు మనలో అపారశక్తి వుంది, కృషి చేస్తే వారి లాగ మనము కూడా కాగలమని ప్రబోధిస్తూనే వున్నారు. మనం కొద్దిపాటి కృషి చేసి వారి మార్గాన్ని అనుసరించడం మొదలుపెడితే… ఏదో ఒకనాడు గమ్యాన్ని చేరుకోగలం. విభిన్న మనస్తత్వాల ప్రజలకు సరిపడే విధంగా వివిధ మార్గాలను కూడా బోధించారు. ఇక చేయవలసిందల్లా ఆధ్యాత్మిక జాగృతమే.
-స్వామి శారదానంద