నూతన భారత దేశం ఉద్భావించాలి…ఇంకా అధికమైన ఔన్నత్యాన్ని పొందాలి.
నూతన భారత దేశం ఉద్భావించాలి . హలాన్ని చేత ధరించిన కర్శకుని నివాసం నుంచి, బెస్తవాని పూరిగుడిసె నుంచి, చెప్పులు కుట్టువాని వృత్తి నుంచి, పారిశుద్ద్యం చేసేవాని శ్రమ నుంచి నూతన కాంతులతో భారతదేశం విరాజిల్లాలి. పచారీ అంగళ్లతో, బజారులో తిరిగి విక్రయించే ఆహార పదార్థాల అంగళ్ల సందడితో, భారత దేశం ఆవిర్భావించాలి . ఇంకా కర్మాగారాలు, బజార్లు, తోటలు, అరణ్యాలు, కొండలు, గుట్టలు ఈ సముదాయంతో కూడా కొత్త భారతం కళకళలాడాలి. మన గతం చాలా సుసంపన్నమైనదే. అనుమానం లేదు. కానీ భావి భారతం ఇంకా అధికమైన ఔన్నత్యాన్ని పొందాలి.
-స్వామి వివేకానంద