హిందుత్వం మతం కాదు, భారతీయుల జీవన విధానం. ఇది అత్యంత సనాతనం.
హిందూ ధర్మానికి ప్రత్యేకించి ఒక్క స్థాపకుడు అంటూ ఎవరూ వుండరు. అందుకే ఇది మతం కాదు జీవన విధానం, ధర్మం. ఎందుకంటే ఇది వ్యక్తుల నుంచి వచ్చిన జ్ఞానం కాదు. కెమిస్ట్రీని కనుగొన్నది ఎవరు? జువాలజీని కనుగొన్నది ఎవరు? ఇలా మిగితా విషయాలను కనుగొన్నది ఎవరో చెప్పగలమా? దీనికి కచ్చితమైన సమాధానం వుందా? అస్సలు వుండదు. అలాగే ఈ సనాతన హిందూ ధర్మం కూడా ఎంతో మంది సైంటిస్టుల పరిశోధనల ఫలితమే. ఆ పరిశోధకులే మన ఋషులు, మునులు. ఓ క్రిస్టియననని అడిగితే బైబిల్ ఇస్తాడు. ఓ ముస్లింని అడిగితే ఖురాన్ ఇస్తాడు. అదే హిందువుని అడిగితే… తన గ్రంథాలయానికి ఆహ్వానిస్తాడు. ఎందుకంటే ఇక్కడ వున్నది మితం కాదు. అనంతం. హిందుత్వం మతం కాదు. భారతీయుల జీవన విధానం. ఇది అత్యంత సనాతనం.
– స్వామి చిన్మయానంద