నేపాల్ తిరిగి హిందూ దేశంగా పున: స్థాపితం కావడానికి భారత్ సహకరించాలి
నేపాల్‌ను మళ్లీ హిందూ దేశంగా మార్చడానికి భారతదేశంలోని సనాతన సమాజం మొత్తం మాకు సహకరించాలి.నేపాల్ హిందూ చరిత్ర, సంస్కృతి చాలా లోతైంది, ముఖ్యమైంది కూడా. అందుకే హిందూ చరిత్రను పున: స్థాపించాల్సిన అవసరం వుంది. నేపాల్ భారత్ మధ్య మతపరమైన మరియు సాంస్కృతిక సంబంధాలు శతాబ్దాల నాటివి. ఈ రెండు అంశాల ప్రాతిపదికన ప్రత్యేక సంబంధాలను కలిగి వున్నాం. పశుపతి నాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయాల ద్వారా ఇరు దేశాలూ లోతైన ఆధ్యాత్మిక సంబంధాలు కూడా కలిగి వున్నాయి. నేపాల్‌ను హిందూ దేశంగా తిరిగి పున: స్థాపితమైతే.. కేవలం ధార్మికమైన సంతులనమే కాకుండా సాంస్కృతిక, సామాజిక ఐక్యత కూడా మరింత బలపడుతుంది.
-నేపాల్ ప్రముఖ నేత శంకర్ భండారీ