కొన్ని విషయాల్లో అమెరికన్ల కన్నా భారతీయులే మెరుగు : అమెరికా రాయబారి ఎరిక్ గర్సేట్టి
భారత్ , అమెరికా సంబంధాలు 21 వ శతాబ్దంలో కీలక పాత్ర పోషించనున్నాయి. స్వేచ్ఛాయుత , న్యాయపరమైన ఎన్నికల విధానంతో వచ్చే పదేళ్లలో భారత్ శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా మారనుంది. అక్కడ చట్టాలు బలంగా వున్నాయి. కొండ ప్రాంతాల్లో వుండే వారిని కూడా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు అధికారులు కాలినడకన ఈవీఎంలను తీసుకొని వెళ్తారు. నగదు పంపిణీని అడ్డుకునేందుకు వాహనాల తనిఖీ వుంది. రాజకీయంగా ధైర్యంగా విమర్శలు చేసే పరిస్థితి అక్కడ వుంది . అందరి హక్కులనూ గౌరవిస్తుంటారు. కొన్ని విషయాల్లో అమెరికన్ల కన్నా భారతీయులే మెరుగ్గా వున్నారు. భారతనతో సంబంధాలపై పరిపూర్ణ విశ్వాసాన్ని వుంచుతున్నాం.
-అమెరికా రాయబారి ఎరిక్ గర్సేట్టి