పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకుంటాం, పీఓకే భారత్‌లో అంతర్భాగమే
పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకుంటాం. పీఓకే భారత్‌లో అంతర్భాగమే. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో పూర్తి నిబద్ధతతో వుంది. పీఓకేలో నిర్వహణ లోపం వుంది. అది వారి విషయం. కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రం మాది. ఎందుకంటే మొత్తం కశ్మీర్ ఇండియన్ యూనియన్‌తో కలిసిపోయి వుంది. పాక్ వద్ద అణుబాంబు వుందంటూ కొందరు అంటున్నారు. 1.3 బిలియన్ల జనాభా కలిగిన భారత్, ఒక అణుశక్తి అని… ఎవరికైనా భయపడుతుందా? తన హక్కును వదులుకుంటుందా?
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా