ఉగ్రవాద కుటుంబాలకు, బలగాలపై రాళ్లు రువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలివ్వం
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కుటుంబాలకు, బలగాలపై రాళ్లు రువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలివ్వం. ఈ నిర్ణయంపై కొంత మంది మానవ హక్కుల కార్యకర్తలు సుప్రీం కోర్టుకి కూడా వెళ్లారు. ఈ వాదనల్లో ప్రభుత్వ వాదనలే నెగ్గింది. కశ్మీర్‌లో ఎవరైనా ఉగ్రవాద సంస్థల్లో చేరితే వారి కుటుంబీకులు ఎప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందలేరు. రాళ్లు రువ్వే ఘటనల్లో పాల్గొనే వ్యక్తుల కుటుంబాలకూ ఇది వర్తిస్తుంది. అయితే… తమ వారు ఉగ్రవాదంలో చేరిపోయారని చెప్పిన కుటుంబ సభ్యులకు గానీ, వారి బంధువులు గానీ తమకు సమాచారం ఇస్తే అలాంటి బాధిత కుటుంబాలకు మాత్రం మినహాయింపు కచ్చితంగా వుంటుంది. ఉగ్రవాదుల మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగిస్తే అంతిమ యాత్రకు అనవసర ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే ఆ ట్రెండ్‌ని ఆపేశాం.
-కేంద్ర హోం మంత్రి అమిత్ షా