గత 10 సంవత్సరాల్లో భారత్ అద్భుతంగా అభివృద్ధి చెందింది.
గత 10 సంవత్సరాల్లో భారత్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. విమానాశ్రయాలు, రోడ్లు, రైళ్లు, సముద్ర మార్గాల్లో మౌలికసదుపాయాల అభివృద్ధి అపూర్వం. మోదీ నాయకత్వంలో విదేశాంగ విధానం కూడా అద్భుతంగా వుంది. ఆయన విజయాలలో అతిపెద్దది ఇదే. మోదీ పాలన పట్ల భారత ప్రజలు విశ్వాసాన్ని చూపిస్తున్నారు. జీ 20 సమావేశాలను కూడా అద్భుతంగా నిర్వహించారు. విదేశాంగ విధానంతో పాటు ఆర్థిక విధానాలు కూడా అద్భుతంగా వున్నాయి. మోదీ పరిపాలనలో భూటాన్` భారత్ సంబంధాలు అత్యద్భుతంగా సాగుతాయి. భారత ప్రధాని మోదీ నాకు గురువు. పెద్దన్నలాంటివారు. ఆయనంటే నాకు చాలా గౌరవం. మోదీ ఆశీర్వాదాలు మాపై వుండాలని కోరుకుంటున్నా. ఆయన చేసే ప్రతి పని, వ్యాఖ్యల వెనుక ఎంతో అర్థం వుంటుంది.
-భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్గే