భారత్‌ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. పాక్‌ మాత్రం ఇంకా

భారత్‌ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. పాక్‌ మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలనూ నివారించలేకపోతోంది. చంద్రుడిపై భారత్‌ కాలు మోపినట్లు టీవీలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండు సెకన్లలోనే అదే తెరపై కరాచీలో పిల్లలు మురుగు కాలువల్లో పడి మరణించిన సమాచారం వచ్చింది. పాక్‌కి కరాచీ ప్రధాన ఆదాయ వనరు. రెండు నౌకాశ్రయాలున్నాయి. దేశానికి ఈ నగరం ముఖద్వారం వంటిది. కానీ 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందడం లేదు. వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు పాఠశాలలకే వెళ్లడం లేదు.

-పాక్ చట్ట సభల సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *