వియత్నాం రాజుకి స్ఫూర్తినిచ్చిన మహారాణా ప్రతాప్

ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్లు పోరాటం చేసి దాని మెడలు వంచి విజయం సాధించిన దేశం వియత్నాం. అమెరికాపై సాధించిన విజయం తర్వాత వియత్నాం అధ్యక్షుడిని ఒక విలేకరి ఇలా ప్రశ్నించాడు. మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికీ అంతుబట్టడం లేదని అన్నాడు. ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు చెప్పిన సమాధానం ఏమంటే శక్తివతంమైన అమెరికాను ఓడించడానికి నేను గొప్ప దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను…. అతని జీవితం నుంచి ప్రేరణ పొంది యుద్దనీతి, ప్రయోగాలతో విజయం సాధించాం అని అన్నాడు .

ఎవరా భారతీయ రాజు? అని విలేకరి అడిగితే వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి అతడే రాజస్థాన్‌లోని మేవాడ్ వీరుడు మహారాజు రాణా ప్రతాప్ సింగ్ అని గర్వంగా ప్రకటించాడు. మహారాణా ప్రతాప్ సింగ్ పేరు చెప్పేటప్పుడు అతడి కళ్లల్లో వీరత్వం తొణికిసలాడింది. అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారమని అన్నాడు. కాలక్రమంలో వియత్నాం అధ్యక్షుడు చనిపోయిన తర్వాత అతడి సమాధి మీద ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుడిదని రాశారు. కొన్నేళ్లకు వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి విచ్చేశాడు. దేశంలోని గొప్పవారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఆయనకు మొదట గాంధీ సమాధి చూపించారు. ఆ తర్వాత ఎర్రకోట ఇలా చూపించేటప్పుడు వియత్నాం మంత్రి మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడ? అని ప్రశ్నించాడు.

ఆ మంత్రి ప్రశ్నకు ఆశ్చర్యపోయిన భారత అధికారి ఉదయపూర్‌లో ఉందని తెలిపాడు. ఆయన ఉదయ్‌పూర్ వెళ్లి సమాధిని దర్శించి, అక్కడ నుంచి పిడికిడు మట్టిని తీసుకొని తన బ్యాగ్‌లో వేసుకున్నాడు. దీన్ని గమనించిన భారత అధికారి మట్టిని బ్యాగ్‌లో ఎందుకు పెట్టుకున్నారని అడిగాడు…. ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులకు జన్మనిచ్చింది… అందుకే దీన్ని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతాను. ఇలాంటి రాజు ప్రేరణతో అక్కడ కూడా దేశభక్తులు జన్మిస్తారని…. మహారాణా ఈ దేశమే కాదు ప్రపంచం గర్వించదగ్గ రాజని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *