జీవన విలువలను వదలడం వల్లే దిగజారాం: లోక్‌ మంథన్‌లో మోహన్‌ భాగవత్‌

ఆనందం, సుఖం, సంతోషం కోసం మథనం అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు ప.పూ సరసంఘచాలక్‌ డా.మోహన్‌ భాగవత్‌ అన్నారు. సుఖం కోసం అందరూ బయటి ప్రపంచం వైపు చూస్తారు కానీ.. అది అక్కడ దొరకదని, అంతరంగంలోనే దొరుకుతుంద న్నారు. నిజమైన సుఖం లోపల లేదని, అంతరంగంలో శోధించడం ప్రారంభిస్తేనే అసలైన సత్యం దొరుకుతుందన్నారు. శిల్పకళా వేదికలో లోక మంథన్‌ భాగ్యనగర్‌ 2024 ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లోకం, సృష్టి, ధర్మం ఈ మూడూ కలిసే నడుస్తాయని, ప్రళయం వరకూ వుంటాయన్నారు. ఇవి సనాతనమని, ఈ మూడూ కలిసి వుంటేనే అస్తిత్వం అన్నది కొనసాగుతుందని, పుట్టడం, పెరగడం, మార్పు చెందడం, నశించడం ఈ మూడిరటితోనే వుంటా యన్నారు. ఈ సత్యాన్ని మన పూర్వీకులు శోధించారని, ఇతర సమాజం శోధించలేదని తేల్చి చెప్పారు.

వివిధ వాసనలు, వివిధ కర్మలతో మనకు మనుష్య జన్మ లభించిందని, వాటిని పూర్తి చేసుకోడానికి పరుగెత్తుతారన్నారు. ఒకానొక దశలో అలసి పోయి ఆగిపోతామని, కానీ ఆనందమూ దొరకదు. సంతోషమూ లభించదని, మరి కొంత సమయం తర్వాత శరీరం విడిచిపెట్టేస్తాం… ఇలా అనుకునే ఆగిపోతామన్నారు. కానీ… మన పూర్వీకులు ఆగిపోలేదని, వారికి బయట దొరకలేదు కాబట్టి.. అంతరంగంలో శోధించడం ప్రారం భించారని వివరించారు. అప్పుడు అసలైన సత్యం వారికి లభించిందని అన్నారు. ఏకత్వ భావన వుంటే అంతా మనదే అన్న భావన వస్తుందని, అంతేకాకుండా అందరూ సుఖంగా వుంటేనే మనం కూడా సుఖంగా వుంటామనీ అర్థమైందని వివరించారు.

వాస్తవానికి సుఖం లభించాలంటే అందరూ సుఖమయ జీవితం జీవించాలని, అప్పుడే సుఖమయ జీవితం సిద్ధిస్తుందని స్పష్టం చేశారు. ఇవన్నీ సిద్ధించాలంటే చాలా ఉపకరణాలు కావాలి. అందుకే పూర్వజులు ఈ భారత దేశాన్ని నిర్మించారని మోహన్‌ భాగవత్‌ తెలిపారు.

 భారతదేశం పుట్టిందే ఈ పునాదులపైన అని అన్నారు. చరిత్ర కన్ను తెరిచినప్పటి నుంచి కూడా ఈ ప్రయాణమే కనిపిస్తుందని, అప్పుడు మన పూర్వజులు ఎలాగైతే ఆలోచించి, జీవనం సాగించారో… ఇప్పటికీ ఇంత సమాజం మారినా… ఆంతరంగికంగా మాత్రం ఆ పదార్థమే వుంటుందని, అలాంటి జీవనమే ఇప్పుడూ కనిపిస్తుందని తెలిపారు. ఇలాంటి జీవనయానం మరెక్కడా దొరకదని, కేవలం భారత్‌లోనే దొరుకుతుందన్నారు. ఎందుకంటే ఈ తత్వాన్ని అందరికీ పంచడం తమ కర్తవ్యంగా రుషులు భావించారన్నారు. దీనికి ఉపకరణంగా ఓ దేశం కావాలని భావించారని అదే భారతదేశమని వెల్లడిరచారు. ఈ దేశం సనాతనమని ప్రకటించారు.

ఒకప్పుడు అటవీ సంపద, అడవిపై హక్కులన్నీ గిరిజనులకే వుండేవని, కానీ… ఆంగ్లేయుల పాలన వచ్చిన తర్వాత ఈ హక్కులన్నింటినీ వారి చేతుల్లోకి తీసుకున్నారన్నారన్నారు. అలాగే ఆంగ్లేయులు మన సంస్కృతిని కూడా ధ్వంసం చేశారన్నారు. వారు అన్నింటినీ ధ్వంసం చేశారని, అయితే.. కేవలం పరాయి పాలన వల్ల మాత్రమే ఇలా జరిగిందా? అంటే కాదని వివరించారు. మనం ఆత్మ విస్మృతిలోకి దిగజారామని తెలిపారు.

 రానూ రానూ సమాజం దిగజారిపోతోందని, దీంతో సంబంధ బాంధవ్యాలను మరిచిపోతు న్నామని సరసంఘచాలక్‌ అన్నారు. కానీ… అద్భుతమైన జీవనాన్ని మనకు మన పూర్వజులు ఇచ్చారని, ఆధ్యాత్మిక మూలాల ఆధారంగా భౌతిక జీవనాన్ని ఎలా జీవించాలో మన పూర్వజులు ఇచ్చారని తెలిపారు. కానీ, మనం మరిచిపోయామని అన్నారు. సృష్టి అంతా ధర్మం ప్రకారమే నడుస్తుం దని, మన దగ్గరున్న దాన్ని త్యజించి ధర్మాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు.  సమాజంలో సంబంధ బాంధవ్యాలు ధ్వంసమయ్యాయని, స్వార్థ భావనలు పెరిగిపోయాయని అన్నారు.

 మన కార్యం కూడా ఈ రెండు ధారల లాంటిదేనని తెలిపారు. సమాజాన్ని కూడా మనం సరిచేయాలని, ఈ ధోరణులు క్షీణించడం వల్లే సమాజంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. మనమందరమూ ఒక్కటే అని అర్థమైతే ఇవన్నీ సమసిపోతాయని, వనవాసీ, గిరివాసీ, గ్రామవాసి అయినా మనమందరమూ భారత వాసులమేనని ప్రకటించారు. ఇది కేవలం భావనాత్మకమే కాదని, ఇది సత్యమని, ఇలా సంపూర్ణ దృష్టే మన భారత దృష్టి అని వివరించారు.

ఈ దృష్టి కోణం ఇతర దేశాల దగ్గర లేదన్నారు. అంతర దృష్టి అన్న దృక్పథాన్ని పూర్వ జులు ఆచరించారని, ఇప్పుడు ఆధునికులంటున్న శాస్త్రవేత్తలు కూడా చేరుకున్నారని తెలిపారు.

 ప్రస్తుతం ఎంత ఆధునికత విస్తరిస్తున్నా… మూలం మాత్రం రుషులు అందించిన తత్వమే వుంటుందన్నారు. భారత దేశంలో ధర్మం విజ్ఞాన భరితమైంది. మరి విజ్ఞానం ధర్మ సమ్మతమా కాదా.. అని ఆలోచించాలన్నారు. అందుకే మూలాలలోకి వెళ్లి, అధ్యయనం చేయాల్సిన అవసరం వుందన్నారు. ప్రపంచం అంతా ఒక చోట ఆగిపోయిందని, కానీ మనం ఒక శాశ్వతమైన అభివృద్ధి వైపు అడుగులు వెయ్యాలని సూచించారు.

అయితే.. ఈ సమయంలో విదేశాల నుంచి ప్రశ్నలు వస్తూనే వుంటాయని, వాటికి సమాధాన మిస్తూపోతే హద్దే వుండదన్నారు. ఈ తాత్విక ప్రపంచంలో భారత్‌ విజయం సాధించిందన్నారు. కొందరు ఓటమిని అంగీకరించక… వాదనలు చేస్తుంటారని విమర్శించారు. ఇవి రాజకీయ క్షేత్రానికి మాత్రమే పరిమితమన్నారు. కానీ భారత్‌ విజయం సాధించిందన్నారు. ఇన్ని సంవత్సరాలలో వ్యక్తివాదం, భౌతికవాదంతో సహా వాదాలన్నీ వచ్చాయని, దీంట్లోనే కొట్టుమిట్టాడుతున్నారన్నారు. వారి పరిధిలోకి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. లోక్‌ మంతన్‌ డిల్లీ, హైద్రాబాద్‌ లాంటి మహానగరా ల్లోనే కాకుండా మారుమూల ప్రాంతాలలోని గ్రామాల్లో కూడా చిన్నచిన్న లోక్‌మంతన్‌లు ఏర్పాటు చేయాలని మోహన్‌ భాగవత్‌ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *