మహా నాయకుడు శ్రీకృష్ణుడు
ద్వాపర, కలి యుగాల సంధికాలంలో గుజరాత్ ప్రాంతంలో మట్టి అమ్పడున్న నాగరక ప్రపంచాన్నంటినీ ప్రభావితం చేసిన వాసుదేవ శ్రీకృష్ణుడు ఎంతటి పరిపూర్ణ వ్యక్తిత్వం, సామర్థ్యం కలవాడంటే ఆయన్ని భగవంతుడి వూర్ల అవతారంగా పరిగణిస్తాము. అంటే ఆయనలో ఉన్న అనేక వ్యక్తిత్వ లక్షణాలు సాధారణ మానవుల మాట అటుంచి గొప్ప గొప్ప వాళ్లలో కూడా ఒక్క వ్యక్తిలో కనపడవు అని అర్థం. ఆయన వ్యక్తిత్వం, సామర్థ్యం సాధారణ అవగాహనకు అందకపోవడం వల్ల ఆయనను తగినంతగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అందువల్లనే ఆయన చేసిన మహా కార్యాలన్నీ మానవాతీతంగా కనిపిస్తాయి. అంతేకాదు ఆయన మీద అనేక అపోహలు, విమర్శలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
శ్రీకృష్ణుడు యదు వంశానికి చెందినవాడు. చంద్రవంశానికి చెందిన పురూరవ చక్రవర్తి వంశంలోని యయాతికి, శుక్రాచార్యుని కుమార్తె దేవయానికి జన్మించిన కుమారుడు యదువు. శృంజయుడు, విదర్భుడు, సాత్వతుడు, శూరుడు మొదలైనవారు యదువంశంలో ప్రసిద్ధులు. ఆ వంశంలోని వసుదేవుడి కుమారుడు శ్రీకృష్ణుడు. యదువు వారసుడు కాబట్టి యాదవుడని, సాత్వతుని వంశీకుడు కాబట్టి సాత్వతుడని, శూరుని వంశంలో పుట్టాడు కాబట్టి శౌరి అని, వసుదేవుని కుమారుడు కనుక వాసుదేవుడని ఆయన్ని పిలుస్తారు.
శ్రీకృష్ణుడు భారతీయ సమాజ, సంస్కృతి నిర్మాతల్లో ఒకరు. అంటే అనేక రంగాల్లో సమాజానికి దారి చూపిన నాయకుడని అర్థం. శ్రీకృష్ణుడు ధర్మ శాస్త్ర, ధర్మ గోప్త. ఆయన భగవద్గీత వంటి అనేక బోధల ద్వారా ధర్మం అంటే ఏమిటో చెప్పా డు. అధార్మికుల్ని అనేక మార్గాల్లో నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు. ధర్మపక్షాన నిలబడటం, దాన్ని గెలిపించడానికి సర్వశక్తులు ధారపోయడం, ప్రయత్నంలో కష్టనష్టాలు, అపఖ్యాతి వచ్చినా లెక్కచేయకపోవడం, నిరాశలో మునిగిన ధర్మపక్షానికి అర్జునుడి ద్వారా జ్ఞానబోధ చేసి, వ్యూహాలు నేర్పి, సలహాలు ఇచ్చి, ఏకం చేసి వారి ద్వారా అధర్మ పక్షాన్ని నీరసింపచేసి, నాశనం చేసే ప్రయత్నంలో అలుపెరుగకుండా శ్రమించడం శ్రీకృష్ణుని నాయకత్వ లక్షణాలు. అవసరాన్నిబట్టి తాను ధర్మపక్షానికి ముందుండి స్వయంగా నాయకత్వం వహించడం, లేదా సహాయక పాత్ర వహించి మరొకరి చేత పనిచేయించడం అనే రెండు పద్ధతులను ప్రయోగించి ఫలితాలు రాబట్టిన కార్యశీలి శ్రీకృష్ణుడు. ఈ రెండూ విభిన్న నాయకత్వ పద్ధతులు. ఒకవైపు స్వయంగా కంస, పౌండ్రక వాసుదేవ, దంతవక్తలు మొదలైన అధార్మికులను అణచడం, మరోవైపు పాండవుల హితైషిగా, సలహాదారుగా, రాయబారిగా, అర్జున రథసారధిగా పనిచేయడంలో ఈ రెండు పద్ధతులు ఆచరించి చూపాడు.
ధర్మపక్షానికి విజయం చేకూర్చే ఉద్యమంలో ఎప్పుడు సాహసించాలో, ఎప్పుడు వెనక్కి తగ్గాలో ఎరిగిన వ్యూహకర్త శ్రీకృష్ణుడు. యాదవ రాజ్యం మీద దాడి చేసిన లోక కంటకుడైన జరాసంధుణ్ణి అనేకమార్లు జయించి, తరిమికొట్టి తన పరాక్రమాన్ని నిరూపించుకున్నాడు. కానీ ఆదనుకానివేళలో తిరిగి దాడి చేసిన అదే జరాసంధుణ్ణి నిలువరించలేమని తెలిసినప్పుడు యుద్ధంలో వెనుదిరిగి ‘రణచోడ్’ అని పేరు మోశాడు. అంతేకాదు ధర్మస్థాపనకు తాను దూరప్రదేశాల్లో ఉన్నప్పుడు తన ప్రజలను దాడుల నుంచి కాచుకోడానికి భద్రమైన ద్వారకనగరాన్ని నిర్మించాడు. ఇరవై నాలుగు అక్షౌహిణీల సైన్యంతో దండెత్తిన జరాసంధుణ్ణి, ఒకసారి రెండుసార్లు కాదు మూడుసార్లు జయించడం ఒక యోధునిగా, సేనానాయకునిగా శ్రీకృష్ణుడి సామర్థ్యానికి మచ్చుతునక. మహాభారత యుద్ధంలో ఇరువైపులా పోరాడిన మొత్తం సైన్యం పద్దెనిమిది అక్షౌహినీలు మాత్రమే. కానీ శ్రీకృష్ణుడు ఎదుర్కొని గెలుపొందినది అంతకు ఆరు అక్షౌహినీలు అధికంగా ఉన్న జరాసంధుడి అధార్మికుడిని జయించడానికి తనకు అవకాశం లేనప్పుడు ఉపాయంతో వని సాధించడం శ్రీకృష్ణుడి నాయకత్వ లక్షణాల్లో ముఖ్యమైనది. పైనుంచి చూసే వాళ్ళకు అది విరికితనంగా, శౌర్యహీనతగా కనబడుతుంది. కానీ మనం గమనించవలసినది ఒక వ్యక్తి ఏ ఆదర్శం కోసం పోరాడుతున్నాడు, అతడు దానికి ఎంత చేరువయ్యాడు అనేది. లోకంలో ధర్మపక్షం వహించిన వాళ్ళందరిదీ అన్ని వేళలా పైచేయి అవుతుందని భ్రమపడరాదు. అధార్మికుల్లో బలవంతులుంటారు. జరాసంధుడు అటువంటి వాడే. వాళ్ళ నుంచి సమాజాన్ని కాపాడాలంటే అన్నివేళలా శౌర్యమే వనిచేయదు. ఉపాయం కూడా అవసరం. అటువంటివాడే కాలయవనుడు. జరాసంధుని మిత్రుడు. కాలయవనుడు యాదవులపై దాడిచేయగా అతడిని నేరుగా ఎదుర్కొనే అమాశంలేక ఉపాయంగా యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణుడు. అలా వెళ్ళి వెళ్ళి ముచుకుందుడు అనే ఇక్ష్వాకు వంశపు రాజు యోగనిద్రలో ఉన్న గుహలోకి తీసుకువెళ్ళాడు. కృష్ణున్ని తరిమి కొడుతున్నాను అనే భ్రమలో ఉన్న కాలయవనుడు ఆ చీకటి గుహలో ఉన్న ముచుకుందుణ్ణి చూసి కృష్ణుడనుకొని ఒక్క తాపు తన్నాడు. దాంతో యోగభంగమైన ముచుకుందుడు కళ్ళు తెరచి చూడగానే ఆయన యోగశక్తి తీవ్రతకి కాలయవనుడు చచ్చాడు. ఆ విధంగా ఒక సమాజ కంటకుణ్ణి ఉపాయంతో తొలగించాడు. ఈ వివరాలన్నీ మహాభాగవతంలో ఉన్నాయి. కేవలం గజేంద్రమోక్షం, రుక్మిణీ కళ్యాణం మొదలైన ఘట్టాలకే పరిమితం కాకుండా భాగవం మొత్తం చదివితే ఇలాంటి అనేక విశేషాలు తెలుస్తాయి.
ధర్మానికి విజయం తేలికగా లభించదు. అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. అధార్మికులతో పోరాడే సందర్భంలో ఎంతోమంది స్వజనుల్ని పోగొట్టుకోవలసి వస్తుంది. అనేక నిందలు, శాపాలు భరించవలసి వస్తుంది. నిజమైన నాయకుడు ఈ కషనషాలన్నింటికీ తాను సిద్ధపడటమేకాక తనవారిని కూడా సిద్ధం చేయాలి. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు చేసినది అదే. అందుకే ఆయన మహానాయకుడిగా, అవతార మరుషుడిగా ఆరాధింపబడుతున్నాడు.
– సత్యదేవ