ఒక ఆధునిక మహాత్ముడు -మాధవ్‌ ‌రావ్‌

‌చలి, ఎండ, వాన, ఎలాంటి వాతావరణ పరిస్థుతుల్లోనైన హవాయి చెప్పులు వేసుకుని, సాధారణ కుర్త ధోతి కట్టుకొని ధట్ట మైన ఆడవుల్లోని గిరిజన గ్రామాల్లో దూరదూరాలకు కాలినడకన ప్రయాణించి అక్కడి పిల్లకు జ్ఞాన మార్గాలు తెరిచే మాధవరావు కానేజీ జీవితం అంటే 50 ఏళ్ల సమాజా సమర్పిత జీవితం కథ. ఈ తరంవారు చదవాలి, చదివించాలి. 15-12-1927 నాడు కళ్యాణ్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఈయన ఎలాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారక్‌ అం‌టే ఈయన నడవడిక, జీవన విధానాన్ని చూసి సంఘాన్ని అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర రాష్ట్రం థానే జిల్లా, తలాసరి తాలూకాలోని వనవాసి విద్యార్థులకు విద్యార్జన చేయడానికి మరియు వారి జీవితాన్ని వికసింపచేయడానికి ఆయన తన జీవితం 28 సంవత్సరాలు వెచ్చించారు. ఆయన తన జీవితమంతా ఇతరుల కోసమే జీవించారు.

యువకుడిగా ఉన్నప్పుడు గోవా ముక్తి సంగ్రా మంలో చివరి వరకు సత్యాగ్రహిగా జీవించారు. తర్వాత 1964లో ఆయన కళ్యాణ్‌ ‌మున్సిపాలిటీకి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నాటి భారతదేశంలో ఆయన పిన్న వయసు గల నగర అధ్యక్షుడు, కళ్యాణ్‌ ‌నగర్‌ ‌మున్సిపాలిటీలో ఆయన కార్యాలయం అత్యంత సఫలకార్య కాలంగా చెబుతారు.

కానీ ఈ ఆధునిక తపస్వి కళ్యాణ్‌ ‌విభాగ్‌ ‌ప్రచారక్‌ ‘‌దాము అన్న టోకేకర్‌’ ఆహ్వానం మేరకు తన రాజకీయ బంగారు భవిష్యత్తుకు స్వస్తి చెప్పి తలాసరిలోని వనవాసిల సేవలో వెళ్ళిపోయారు. కానేజీ ఎంతో కృషి చేసి 1967లో హిందూ సేవా సంఘం ద్వారా ఐదుగురు విద్యార్థులకు ఒక పూరి గుడిసెలో వనవాసి వసతిగృహాన్ని స్థాపించారు. తరువాత కానేజీ తన కృషి ఫలితంగా తొమ్మిదిన్నర ఎకరాల భూమి దానముగా దొరికింది.

ఆ ఆవాసములో నుండి గత 55 ఏళ్లలో 2000 కన్నా ఎక్కువ మంది విద్యార్థులు చదివి ఎన్నో క్షేత్రాలలో ఉద్యోగాలు పొంది మంచి జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ విద్యార్థులుని డాక్టర్లులుగా, ఇంజనీర్లుగా, ఉన్నత పదవి సంపాదించే లాగా కానే గారు ఎంతో కృషి చేశారు. అంతేకాదు ఇక్కడ విద్యార్థులు ఉత్తమ పౌరుడిగా నిర్మాణం అయ్యేలా అలా 28 ఏళ్ల పాటు కానేగారు కృషి చేశారు. అనేకసార్లు విద్యార్థుల తల్లిదండ్రులను కలవడానికి రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లేవారు.

మాధవ్‌ ‌రావుజీ నీడలా గడిపే తృతీయ వర్షం పూర్తి చేసిన స్వయంసేవక్‌ అప్పాజీ జోషి, మాధవ రావు గారి గురించి ఇలా అంటారు’’ మాధవరావు గారు ఒక ఆధునిక కాలపు మహాత్ముడు, ఆయన మంచం మీద పడుకుంటారు, గుడిసెలో ఉంటారు, కాలినడకలోనే ప్రయాణిస్తారు, వారి కృషి మూలాన తలాసరి, దహను మరియు ఫల్గుర్లాలో నక్సల్‌ఇజం ములాల నుండి మాయమయింది’’.

కళ్యాణ్‌లో 24 సంవత్సరాలు ఆయన గది వనవాసి పిల్లలకు ఇల్లుగా ఉండేది. 17 ఏళ్ల వయసులో ఆయన తన తల్లిదండ్రులను కోల్పోయారు. అయినకు తన చివరి రోజుల్లో క్యాన్సర్‌ ‌సోకింది. అపుడు అయిన డాక్టర్లకి విన్నపం చేసారు. తన చికిత్సకు అవసరమయ్యే ఖర్చు అంతా ఆవాసానికి ఉపయోగిస్తే మంచిది ఎందుకంటే ఆయన తన యాత్ర ముగింపు దశలో ఉన్నారు.

‘‘ధగ ధగ మెరిసే కీర్తికి దూరంగా, కటిక చీకటిలో వనవాసీలకు అభివృద్ధి మార్గాన్ని తెరిచేం దుకు ఆయన జీవితాన్ని సమర్పించారు’’ అని దత్తో పంత్‌ ‌తెంగ్డే గారు ఆయన గురించి అన్న మాటలు కానే గారి జీవితానికి సరైన నిర్వచనాన్ని ఇస్తాయి.

– సేవా గాథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *