పూల ఉత్పత్తిలో దేశంలోనే మూడో స్థానంలో మధ్యప్రదేశ్ రైతులు.. విదేశాలకు కూడా ఎగుమతి

పూల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ రైతులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఏకంగా దేశంలో మూడో స్థానానికి ఎగబాకారు. జైపూర్, ఢిల్లీ తర్వాత మూడో స్థానంలో మధ్యప్రదేశ్ వుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్ రైతులు పండించే పూలు పారిస్, లండన్ కి కూడా ఎగుమతి అవుతున్నాయి. అంతేకాకుండా మహిళా రైతులు కూడా ఈ పూలపై నెలకు 4 లక్షల రూపాయలు సందిస్తూ, ఆర్థికంగా పుష్టి అవుతున్నారు.

అయితే.. చిన్న వ్యవసాయ కమతాలున్న రైతులపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేవలం సంప్రదాయ పంటలే కాకుండా, వాణిజ్య పంటలపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఒకటి నుంచి మూడు ఎకరాల వరకే వున్న చిన్నకారు రైతులకు పూలు పండించడంపై అవగాహన కల్పించారు. మంచి లాభాలు ఆర్జించవచ్చని రైతులకు చెప్పారు. దీంతో రైతులు, మహిళా రైతులు కూడా పూల వైపు దృష్టి నిలిపారు. మెట్రో పాలిటన్ నగరాలతో పాటు విదేశాల్లో కూడా ఈ పూలకు డిమాండ్ పెరిగింది.జైపూర్, ఢిల్లీ, ముంబై తర్వాత గుణ జిల్లా నుండి గులాబీలు ఇప్పుడు పారిస్, లండన్ కి కూడా వెళ్తున్నాయి. దీంతో ఇప్పుడు ఎక్కువ శాతం రైతులు పూల తోటల వైపు ఆకర్షితులవుతున్నారు.

రాజధాని భోపాల్‌లోని బర్ఖేడా బొండార్ గ్రామ పంచాయతీలో నివసించే లక్ష్మీబాయి కుష్వాహా వరి, గోధుమ, సోయాబీన్ సాగును వదిలి గులాబీలు, గెర్బెరా, బంతి పువ్వులను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో నెలలో 3 నుంచి 4 లక్షలు సంపాదిస్తున్నారు.మధ్యప్రదేశ్‌లో, ప్రధానంగా బంతి పువ్వు, గులాబీ, సేవంతి, గ్లాడియోలస్, ట్యూబెరోస్ మరియు ఇసాబ్‌గోల్, అశ్వగంధ, తెల్ల ముస్లి మరియు కోలిక్స్ వంటి ఔషధ పుష్పాలు ఉత్పత్తి అవుతాయి.

రాష్ట్రంలో 24 వేల 214 హెక్టార్లలో బంతి పువ్వు సాగు చేస్తున్నారు. గులాబీ 4 వేల 502 హెక్టార్లలో రెండవ స్థానంలో, సేవంతి 1 వేల 709 హెక్టార్లలో మూడవ స్థానంలో, గ్లాడియోలస్ 1 వేల 58 హెక్టార్లలో నాల్గవ స్థానంలో, ట్యూబెరోస్ 263 హెక్టార్లలో ఐదవ స్థానంలో, ఇతర పువ్వులు 11 వేల 227 హెక్టార్లలో పండిస్తున్నారు.ఇలా నిత్యం రైతులను ప్రోత్సహించడం, అవగాహన కల్పించడంతో రైతులు చాలా మంది పూలవైపు మళ్లారు. కేవలం 2024-2025 లో ఉద్యానవన పంటల విస్తీర్ణం 14 వేల నుంచి 438 హెక్టార్లకు విస్తరించింది. దీనిలో పువ్వుల విస్తీర్ణం 5 వేల 329 హెక్టార్లకు పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *