కుంభమేళా జరిగే ప్రాంతంపై ఇకపై ప్రత్యేక జిల్లా
ప్రయాగరాజ్ లో మహాకుంభ మేళాకి సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగరాజ్ లోని మహాకుంభ ప్రాంతాన్ని ఓ ప్రత్యేక జిల్లాగా ప్రకటించింది. ఇప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని ‘‘మహా కుంభమేళా జనపద్’’ గా పిలుచుకుంటారు. కుంభమేళా నిర్వహణ సక్రమంగా సాగడానికి, నిర్వహణను క్రమబద్ధీకరించడానికే ఈ ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయబడింది. ఈ నూతన జిల్లాలో సదర్, సోహ్రా, ఫూల్ పూర్, కరాచ్నాలోని ప్రయాగ్ రాజ్ తహశీల్ లు వుంటాయి. మొత్తం 67 గ్రామాలు, నాలుగు తాహశీల్లు జోడించబడి వుంటాయి. ఈ నూతన జిల్లాను ప్రకటించడంతో ఇప్పటి వరకూ 75 జిల్లాలుండగా… ఇప్పుడు 76 అయ్యాయి.