పుట్టెడు కరువు ప్రాంతం… నీటిని ఒడిసిపట్టి ఆదర్శంగా నిలిచిన రైతు

ప్రభుత్వం ఏమి సాయం చేస్తుందా? అంటూ ఎదిరి చూడలేదు. అయ్యో కరువు ప్రాంతం కదా అంటూ ఏడుస్తూ కూర్చోలేదు. నీటి కోసం మొగులుకు ముఖం పెట్టలేదు. తనకుండే ఎకరా విస్తీర్ణంలో 41 లోతు, 202 అడుగుల వెడల్పుతో తన వ్యవసాయ క్షేత్రంలో బావి తవ్వించాడు. నీరు ఇంకిపోకుండా బావి చుట్టూ ప్లాస్టరింగ్‌ చేయించాడు. ఇలా దాదాపు 10 కోట్ల లీటర్ల నీటిని ఒడిసిపట్టాడు. దీంతో ఏకంగా 50 ఎకరాలకు హాయిగా నీళ్లు ఇచ్చుకుంటున్నాడు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకుంటున్నాడు. ఇదంతా జరిగింది మహారాష్ట్రలోని పుట్టెడు కరువు ప్రాంతమైన బీడ్‌. ఆ రైతు పేరు మారుతి బాజ్గుడే. ఇప్పుడు ఇదంతా ఎలా సాధించాడో చూద్దాం.

మారుతి బాజ్గుడే. బీడ్‌ జిల్లాలోని పడల్‌ సింగీ గ్రామంలో వుంటాడు. తన తాత ముత్తాతల నుంచి వస్తున్న 12.5 ఎకరాలను సాగు చేసుకుంటున్నాడు. అయితే… బీడ్‌ అనే గ్రామం పుట్టెడు కరువు ప్రాంతం. వర్షాలు బాగా కురుస్తునే అక్కడ సమృద్ధి. దీంతో ఆయన కొన్ని రోజులు పెళ్లిళ్ల డొకేరేటర్‌గా మారి, సంపాదించుకున్నాడు. కానీ… తన వ్యవసాయ భూమిపై మాత్రం మక్కువ తగ్గలేదు.

దీంతో ఎలాగైనా నీటి సమస్య నుంచి బయటపడి, పంటలు బాగా పండిరచాలని డిసైడ్‌ అయ్యాడు. దీంతో తన వ్యవసాయ క్షేత్రంలో పెద్ద బావిని తవ్వించాడు. నీటి సమస్య తీరిపోవాలని భావించాడు. తనకున్న భూమిలో ఒక ఎకరం భూమిని తీసుకొని, బావి తవ్వించాడు. 41 అడుగుల లోతున్న బావిని తవ్వాడు. దీనికి యంత్రాలు, మనుషులను ఉపయోగించాడు. దాదాపు ఇలా 200 అడుగుల లోతు వరకూ చేయించాడు. బావి లోపల గోడ కింది నుంచి దాదాపు 6 అడుగుల మేర కాంక్రీటు నిర్మించాడు. ఈ బావి నీటి సామర్థ్యం 10 కోట్ల లీటర్లు. దీనికి అయిన ఖర్చు 1.5 కోట్లు. ఇప్పుడు ఆ బావిలో నీరు పుష్కలంగా వుంది. ఇలా బావిని తవ్వించుకొని, ఈ నీటి ద్వారా పండ్లను పెంచాలని నిర్ణయించుకున్నాడు. తర్బుజా, జామకాయ, మోసంబితో పాటు పలు పండ్లను పండిరచాలని డిసైడ్‌ అయ్యాడు.

‘‘నాకు 12.5 ఎకరాల వ్యవసాయ భూమి వుంది. నీరు లేకుండా వ్యవసాయం చేయడం అసాధ్యం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కచ్చితంగా మా ప్రాంతంలో కరువు వస్తుంది. నీరు లేకుండా వ్యవసాయం ఎలా చేస్తాం? అందుకే ఆలోచించా. ధైర్యంగా ముందుకు సాగాను. 41 అడుగుల లోతు, 202 అడుగుల వెడల్పుతో బావిని నిర్మించాలని అనుకున్నాను. చిన్న చిన్న నీటి గుంటలతో యేడాది అంతా వ్యవసాయం చేయడం కష్టం. అందుకే యేడాది అంతా నీటిని నిల్వ వుండేలా బావిని తవ్వించాలని అనుకున్నా. ఈ బావి లోతు 41 అడుగులు. ఇందులో 10 కోట్ల లీటర్ల నీరు వుంది. రాబోయే రెండు, మూడు సంవత్సరాలు కరువు వచ్చినా, నా పొలానికి సరిపోయే నీరు ఇందులో వుంది.

తవ్విన మట్టిని అంతా ఏం చేసినట్లు?

ఇంత పెద్ద బావి తవ్వగా చాలా పెద్ద మొత్తంలోనే మట్టి బయటికి వస్తుంది. దీనిని ఆ రైతు తన వ్యవసాయ క్షేత్రానికి దగ్గర్లోనే జాతీయ రహదారి నిర్మాణం చేస్తున్నారు. ఎర్రమట్టిని రోడ్డు నిర్మించే వారికి, నల్ల రాయిని కంకర తయారు చేసే క్రషర్లకు అమ్మేశాను. మిగతా మట్టిని బేస్‌మెంట్‌లో ఉపయోగించుకున్నాడు. ఈ బావి తవ్వడానికి 3 ప్రొక్రేనర్లు, 10 హైవా ట్రక్కులను వాడాడు. అయితే.. ఇదంతా తవ్వుతున్నప్పుడు చాలా మంది చూసి, ఆశ్చర్యపడేవారు. కానీ… దీని విలువ ఇప్పుడు తెలిసి వస్తోంది. బావి నిర్మాణ సమయంలో ఖర్చులు బాగా పెరిగాయి. దీంతో తన భార్య నగలను అమ్మేశాడు.ఈ బావిని చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. బాజ్గూడే తవ్వించిన బావిని చూడడానికే ఇప్పుడు బీడ్‌ జిల్లాకు వివిధ రాష్ట్రాల వారు వస్తుంటారు. తన లాగా ఇతర రైతులు కూడా ఒక సమూహంగా ఏర్పడి, బావులను తవ్వుకుంటే.. ఆత్మహత్యలే వుండవు. రైతు జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వుంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *