రాత్రి పూట ఎరువులు, నీరు అందించి మిర్చి సాగులో సక్సెస్ అయిన రైతు.. రహస్యం ఇదే

మరాఠ్వాడా…. పుట్టెడు కరువు ప్రాంతం. పైగా ఎండా కాలంలో 42 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు  నమోదవుతుంటాయి. అయినా సరే … హింగోలి జిల్లాలోని సోదేగావ్  వుండే నాగేష్  డోక అనే రైతు ఆదర్శంగా  నిలిచాడు. ఎకరం భూమిలో పచ్చిమిర్చి సాగు చేసి , నాలుగు నెలల్లోనే 8 లక్షలు సంపాదించాడు. గతంలో కంటే ఇది నాలుగు రెట్లు అధికమని చెప్పుకొచ్చాడు. జనవరి నుంచి ఏప్రిల్  మాసంలోనే ఈ 8 లక్షలు సంపాదించుకున్నట్లఉ తెలిపాడు. వేడి బాగా వుంటే మిర్చిని ఎవ్వరూ సాగు చేయరు. 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత  వుంటే మాత్రం సాగు చేయవచ్చు.

నాగేష్  మాత్రం ఎండా కాలంలోనే పచ్చి మిర్చి పంట వేసు కున్నాడు. కానీ… కొన్ని ప్రత్యేక పద్ధతిలో, ఎక్కువ ఖర్చు లేని పద్ధతిని  ఫాలో అయ్యాడు. మొదట మిర్చి వేసీ  ప్రాంతాన్ని నాగలితోనే దున్నాడు. ఆ తర్వాత కల్టివేటర్ పొలాన్ని రెండు మార్లు చదును చేశాడు. మిరప మొక్కలకు నీరు, ఎరువులు అందించేందుకు డ్రిప్  విధానాన్ని బాగా వాడాడు. తెల్లవారగానే మిర్చి మొక్కలకు నీరు పోయడం, రాత్రి కూడా ఎరువులు, నీళ్లు పోస్తుండేవాడు . ఇదే పద్ధతిని  బాగా కచ్చితంగా ఫాలో అయ్యాడు. దీంతో రోజూ రెండు క్వింటాళ్ల మిర్చిని ఉత్పత్తి చేశాడు. కిలో 70 నుంచి 80 రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు , లాభంగా వుందన్నాడు. ఎకరంన్నర పొలంలో కేవలం 1.5 లక్షల ఖర్చు అయ్యిందని, కానీ లాభం మాత్రం 8 లక్షల వరకు వచ్చిందని గర్వంగా ప్రకటించుకున్నాడు. గతంలో నగేష్  తన పొలంలో సోయాబీన్ , పసుపును పండిం చేవాడు . పంట మార్పిడి పధ్ధతి  అనుకొని, మిర్చి వైపు మళ్లాడు. ఎండా కాలంలో మిర్చి మొక్కలకు రాత్రి పూట ఎరువులు, నీరు అందించి, అత్యధిక దిగుబడి సవధించాడు. ఇదే నగేష్ రహస్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *